Vijay Sethupathi: ఒప్పుకున్న విభీషణుడు తప్పుకున్నాడు.

విజయ్ గురునాథ సేతుపతి అని అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ విజయ్ సేతుపతి అంటే తెలియని వాళ్ళు లేరు అని చెప్పొచ్చు. పేరుకు తమిళ్ యాక్టర్ అయినా కూడా తెలుగులో కూడా మంచి గుర్తింపును సాధించుకున్నాడు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతికి తెలుగులో కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. అంతగా విజయ్ సేతుపతిని ఇష్టపడతారు తెలుగు ఆడియోన్స్. విజయ్ సేతుపతి జర్నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

అందరి నటులు లా కాకుండా విజయ్ సేతుపతికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది అని చెప్పొచ్చు. యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, స్క్రీన్ రైటర్ గా, లిరిసిస్ట్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా అనేక తమిళ్ ఫిలిమ్స్ లో వర్క్ చేశాడు విజయ్ సేతుపతి. కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా హిందీ, మలయాళం, తెలుగు కన్నడ భాషల్లో కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన విజయ్ సేతుపతి పిజ్జా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నడవుల కొంజెం పక్కత కానుం, సూదుకవ్వం వంటి సినిమాలు చేసి తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్స్ ను ఏర్పాటు చేసుకొని, తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబడ్డాడు విజయ్ సేతుపతి.

- Advertisement -

అందరిలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎన్నుకుంటూ అద్భుతమైన సినిమాలను తన కెరియర్లో చేశాడు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. అనే ఆడియన్స్ కూడా మొదలయ్యారు విజయ్ సేతుపతికి. తెలుగు ప్రేక్షకులుకు తమిళ్ అర్థం కాకపోయినా కూడా విజయ్ సేతుపతి సినిమాలను చూశారు.

ఇకపోతే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో నటించాడు విజయ్ సేతుపతి. ఆ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయాడు విజయ్ సేతుపతి. సందీప్ కిషన్ నటించిన మైఖేల్ సినిమాలో కూడా విజయ్ సేతుపతి నటించాడు. అయితే ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమాలు కూడా తెలుగులో డబ్బింగ్ అవుతూ వస్తున్నాయి.

ఇకపోతే రామాయణం సినిమాను నితీష్ తివారి మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిలో విభీషణుడు క్యారెక్టర్ కోసం ముందు విజయ్ సేతుపతిని అనుకున్నాడు. అయితే విజయ్ సేతుపతి ప్రస్తుతం తన డేట్స్ ఖాళీ లేని కారణంగా ఈ సినిమాను చేయట్లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే నెల శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా అయోధ్యలో మొదలెట్టెల ప్లాన్ చేస్తున్నాడు నితీష్ తివారీ. అలానే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2026 లో రిలీజ్ చేయనున్నట్లు నితీష్ తివారి ఇదివరకే తెలిపాడు. ఈ సినిమాలో లక్ష్మణుడు పాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపిస్తాడని కూడా రివీల్ చేశారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు