Allu Arjun: పుష్ప ప్రోమోషన్స్ స్టార్ట్ చేసినట్లేనా.?

ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అయితే మొదటి సినిమాతోనే తనలోని నటుడిని బయటికి తీసి ఇండస్ట్రీకి ఒక కొత్త హీరో దొరికాడు అనే విధంగా ఆ సినిమాలో నటించాడు అల్లు అర్జున్. అయితే ఆ సినిమా కమర్షియల్ గా అంత హిట్ కాలేదు. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో చేసిన ఆర్య సినిమా ఒక సంచలనం అని చెప్పొచ్చు. అక్కడి నుంచే అల్లు అర్జున్ టైం కూడా స్టార్ట్ అయింది.

అల్లు అర్జున్ క్యారెక్టర్జేషన్ ను సుకుమార్ డిజైన్ చేసిన విధానం అప్పట్లో యూత్ కి క్రేజీగా ఎక్కింది. వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ ను అద్భుతంగా చూపించి అందర్నీ మెస్మరైజ్ చేశాడు సుకుమార్. ఆ తర్వాత వరుస సక్సెస్ లను అందుకున్నాడు అల్లు అర్జున్. అయితే ప్రతి హీరో కెరియర్ లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటూ ఉంటుంది. అలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అల్లు అర్జున్ కెరియర్ లో ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసిన సినిమా మాత్రం పుష్ప.

పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే పుష్ప సినిమా సృష్టించిన సంచలనం మాములుది కాదు. క్రికెటర్స్, పొలిటిషియన్స్ ఇలా చాలామంది ఆ సినిమాలోని డైలాగ్స్ ని వాడడంతో ఆ సినిమా క్రేజ్ ఇంకా ఇంకా పెరిగిపోయింది. నార్త్ ఇండియన్స్ కైతే ఈ సినిమా ఒక రేంజ్ లో ఎక్కింది అని చెప్పొచ్చు. పుష్ప సినిమాకి నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పెట్టారు.

- Advertisement -

పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప-2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15 కి రిలీజ్ కానుంది ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమా హిట్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇకపోతే రీసెంట్ గా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ గురించి కొన్ని అద్భుతమైన విషయాలను పంచుకున్నాడు అల్లు అర్జున్.

బాలీవుడ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మంచి లవ్ స్టోరీస్, కాన్సెప్ట్ బేస్ సినిమాలన్నీ కూడా బాలీవుడ్ లోని నిర్మితమయ్యాయి. అయితే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ అనేది వెనకబడింది అని చెప్పొచ్చు. ఏ సినిమా చేసినా కూడా అంతగా వర్కౌట్ కావట్లేదు. అయితే దీనిబట్టి చాలామంది బాలీవుడ్ ని తక్కువ చేస్తూ మాట్లాడారు. దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు.

బాలీవుడ్ కి ప్రస్తుతం బాడ్ పేజ్ నడుస్తుందని, అది జస్ట్ పేజ్ అని, గొప్ప గొప్ప సినిమాలన్నీ వాళ్ళు ఒకప్పుడు నిర్మించారని, వాళ్ళని చూసి కూడా మనం సినిమాలు ఎలా తీయాలి అని నేర్చుకున్నామంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. అయితే ఇది కొంతమందికి పాజిటివ్గా అనిపిస్తున్న కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ రెడీగా ఉంది కాబట్టి బాలీవుడ్ ని లేపుతున్నాడు. ఆల్రెడీ పుష్ప సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా ఇప్పుడు తెలుగు సినిమా చూపిస్తున్న హవా తక్కువేమీ కాదు. సందీప్ రెడ్డి వంగ లాంటి తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్ కి వెళ్లి మరి మన మార్క్ చూపిస్తున్నారు అని చెప్పొచ్చు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు