Kalki : కాల భైరవను మర్చిపోతారా.?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు తీసినవి రెండే సినిమాలు అయినా కూడా ఎనలేని గుర్తింపును సాధించుకున్నాడు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అవడంతో పాటు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అని అనిపించింది. చాలా సింపుల్ గా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు నాగ్ అశ్విన్.

ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ చేసిన రెండవ సినిమా మహానటి. మహానటి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కీర్తి సురేష్ లాంటి ఒక హీరోహిన్ తో సావిత్రి గారి పాత్రను చేయించాలి అనే థాట్ రావటమే ఒక రేర్ థింగ్ అనుకుంటే, ఆమెను పెట్టి మహానటి లాంటి సినిమా చేసి ఎవరు ఊహించని విజయాన్ని సాధించడం మామూలు అచీవ్మెంట్ కాదు.

ఆల్మోస్ట్ ప్రేక్షకులు థియేటర్ కి రావడం మానేశారు, అనుకునే తరుణంలో ఒక గొప్ప సినిమా చేస్తే ఆడియన్స్ వెతుక్కుని మరి సినిమాకు వస్తారు. అని నిరూపించిన సినిమా మహానటి.
ఒక బయోపిక్ ని ఇంతమందికి ఆకట్టుకునేలా వారి మనసుని హత్తుకునేలా తీయటంలో 100% సక్సెస్ అయ్యాడు దర్శకుడు అని చాలామంది ప్రశంసలు కురిపించారు.

- Advertisement -

ఇక నాగ్ అశ్విన్ నుంచి వస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ఈ సినిమాలో నటిస్తున్నది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈయన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి ఎక్కడికో తీసుకెళ్తే ఆ స్థాయిని కొనసాగిస్తూ పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకుంటున్నాడు ప్రభాస్. అయితే ఆ ప్రాజెక్టులు కొన్ని ఫెయిల్ అయినా కూడా ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు అని చెప్పొచ్చు.

ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. లుక్ తో పాటు ప్రభాస్ క్యారెక్టర్ నేమ్ దీనిలో బైరవ అని రీవిల్ చేసింది చిత్ర యూనిట్. భైరవ అనగానే చాలామందికి గుర్తొచ్చేది రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్. అంత పవర్ ఫుల్ గా ఆ క్యారెక్టర్ డిజైన్ చేశాడు రాజమౌళి. అయితే ఇప్పుడు కల్కి సినిమా రిజల్ట్ ని బట్టి ఈ భైరవ ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి చిన్న పిల్లవాడిని అడిగినా కూడా కాలభైరవ అంటే రామ్ చరణ్ అని చెప్తారు. ఇప్పుడు భైరవ అంటే ప్రభాస్ అని ఇంపాక్ట్ చూపించేలా కల్కి సినిమా ఉంటే ఆ భైరవ ను మర్చిపోతారు అని చెప్పొచ్చు.

ఇకపోతే ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ నటిస్తుంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నాడు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు