Dunki: డంకీ ఫస్ట్ డే కలెక్షన్స్.. హ్యాట్రిక్ కష్టమే అంటున్న ఆడియన్స్..!

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ ,జవాన్ సినిమా భారీ విజయాన్ని సొంతంలతో చేసుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో రికార్డులన్నీ కూడా బ్రేక్ చేశారు. ఇప్పుడు డంకీ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారని.. ఈసారి హ్యాట్రిక్ పక్కా అంటూ అభిమానులు సైతం ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఊహించని విధంగా ఆయన చేసిన మూడవ సినిమా పూర్తిగా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం .

రాజకుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఢంకీ .. ఈ సినిమా డిసెంబర్ 21న చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది కానీ కేవలం హిందీ భాషలోనే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ముఖ్యంగా జవాన్ పఠాన్ సినిమాలు ఏకంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ ఈ సినిమా ఎమోషనల్ డ్రామా కావడంతో మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. పైగా హిందీ లోనే రిలీజ్ కావడంతో సౌత్ ఆడియన్స్ ఎవరూ కూడా సినిమాపై ఆసక్తి చూపించలేదు. అంతేకాదు సినిమా కాన్సెప్ట్ బాగున్నా కేవలం A సెంటర్స్ కి మాత్రమే పరిమితం అయ్యేలా ఉంది ఈ సినిమా.

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ గత రెండు సినిమాలు మొదటి రోజు రూ .100కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టగా డంకీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ .70 కోట్ల వరకు మాత్రమే గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇండియాలో అయితే కేవలం రూ.60 కోట్ల గ్రాస్ అంటే ఈ సినిమా మాత్రం రూ .30 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడ లేదు కానీ సినీ ట్రేడ్ ప్రముఖులు మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

- Advertisement -

ఇకపోతే గత రెండు సినిమాలకి భారీగా కలెక్షన్లు వచ్చి .. ఈ సినిమాకి దారుణంగా కలెక్షన్లు రావడంతో పాటు మిక్స్డ్ టాక్ కూడా రావడం సినిమాకు మైనస్ అయిందని చెప్పాలి. అంతేకాదు సలార్ పోటీ ఇవ్వడంతో.. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ సాధిస్తాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ఈ కలెక్షన్లు చూస్తుంటే ఇక ఈసారి షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ కొట్టడం కష్టమే అని ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో బోల్తా పడ్డారని చెప్పవచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు