Chiranjeevi: మెగాస్టార్‌పై విష ప్రయోగం.. షాక్ లో ఇండస్ట్రీ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారిలో చిరంజీవి కూడా ఒకరు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈయన మరి ఎంతో మందికి అద్భుతమైన జీవితాన్ని కూడా ప్రసాదించారు అని చెప్పవచ్చు. ఇక చిరంజీవి అడుగుజాడల్లోనే ఆయన కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీలోకి మొదట విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ఎదిగి మెగాస్టార్ గా గుర్తింపు పొందారు చిరంజీవి. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇటీవల కాలంలో రీ ఎంట్రీ లో కూడా చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిగా భోళా శంకర్ సినిమాలో నటించి ఘోరమైన ఫ్లాప్ ని మూట కట్టుకోవడం జరిగింది. దీంతో కథల ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిరంజీవి. ఇదంతా ఇలా ఉండగా చిరంజీవి పై విష ప్రయోగం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అసలు విషయం లోకి వెళ్తే.. గతంలో ఒక అభిమాని తన పుట్టినరోజు వేడుకలు అంటూ పిలవడంతో అభిమాని కోరిక మేరకు పుట్టినరోజు ఫంక్షన్ కి వెళ్లారు.

ఆ సమయంలోనే చిరంజీవి పైన కొంతమంది మర్డర్ అటెంప్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేసినట్లుగా అప్పట్లో వార్తలు అయితే ఎక్కువగా వినిపించాయి.. వాస్తవానికి చిరంజీవి బయట ఫుడ్ తినాలంటే చాలా భయపడేవారు. షూటింగ్ సమయాలలో ఏదైనా ఇబ్బంది వస్తే మళ్లీ షూటింగ్‌కు నష్టం అవుతుందని భావించేవారు. అయితే చిరంజీవి నటిస్తున్న మరణ మృదంగం అనే సినిమా షూటింగ్ మద్రాసులో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్లో ఫ్యాన్స్ గేటు వద్ద ఉండడంతో వారిని కలిసేందుకు వెళ్లగా అక్కడ ఒక అభిమాని చిరంజీవి కాళ్ళ పైన పడుతూ తన బర్తడే అని చెప్పి కేక్ కట్ చేయాలని బలవంతం చేశారు.

- Advertisement -

అంతేకాకుండా కేక్ తినాలని చిరంజీవిని కోరడంతో ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు.. తిననని చెప్పినా కూడా దీంతో అభిమాని చిరంజీవి నోట్లో కేకుని బలవంతంగా కుక్కాడు. కానీ అక్కడ తోపులాటలో కేకు కింద పడింది . శుభ్రం చేసుకోవడానికి వాష్ రూమ్ కి వెళ్ళగా కేక్ తగిలిన చోట పెదాల రంగు మారిపోయింది. ఎలా అంటే చిరంజీవి నాలుక నీలిరంగులోకి మారిపోయింది..ఇది గమనించిన మేకప్ మ్యాన్ వెంటనే దర్శక నిర్మాతలతో చెప్పి చిరంజీవిని ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు చిరంజీవి పైన విషప్రయోగం జరిగిందన్నారు. దీంతో చిరంజీవికి వాంతి అయ్యేలా వైద్యులు చికిత్స చేయడంతో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక చిరంజీవి ఎదుగుదలను ఓర్వలేక ఇలా చేశారని సమాచారం. ఇకపోతే ఈ వార్త అప్పట్లో పెను సంచలనంగా మారింది. పక్క వాళ్ళు బాగుపడితే ఓర్వలేని కొంతమంది ఇలాంటి ప్రయోగాలు చేస్తారనడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు