Chiranjeevi: సలార్ పై చిరంజీవి రివ్వూ.. ‘తగలబెట్టేశావ్ దేవా’..!

రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్.. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సినిమా అభిమానులలకు ఫీవర్ లా మారిపోయింది. టాలీవుడ్ , కోలీవుడ్ , బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల అభిమానులు సలార్ గురించే మాట్లాడుతున్నారు. మొదటి రోజే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ లభించడంతో అభిమానులు సూపర్ హ్యాపీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ని ఎలివేట్ చేస్తూ బ్లడ్ బాత్ చేయిస్తూ డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ కి ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న శ్రీ విష్ణు థియేటర్లలో సందడి చేయగా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా సలార్ చిత్రానికి తనదైన శైలిలో రివ్యూ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

చిరంజీవి ఈ సినిమాకి రివ్యూ ఇస్తూ.. బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేస్తున్నందుకు మై డియర్ దేవా.. రెబల్ స్టార్ ప్రభాస్ కి కంగ్రాట్స్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి నా అభినందనలు. సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో మీకు మీరే సాటి. వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ , ఆద్య పాత్రలో శృతిహాసన్, కార్త పాత్రలో జగపతిబాబు లీనమైపోయి చాలా అద్భుతంగా నటించారు. అలాగే హోంబలే సంస్థకు, చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు థాంక్యూ బాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి లాంటి వారే ఈ సినిమాపై అద్భుతమైన పాజిటివ్ కామెంట్ ఇవ్వడంతో సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే రెండు భాగాలుగా తెరకెక్కుతోంది . సలార్ లో మొదటి భాగాన్ని “సలార్ సీజ్ ఫైర్ ” అనే టైటిల్ తో రిలీజ్ చేయగా .. రెండవ భాగాన్ని “సలార్ శౌర్యంగ పర్వం” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత అభిమానులకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకుంటూ ఒక మాస్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు ప్రశాంత్ నీల్. ఇక కే జి ఎఫ్ సినిమాలతో విధ్వంసాన్ని సృష్టించిన ఈయన ఇప్పుడు సలార్ సినిమాతో అంతకుమించి అనేలా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. ఏది ఏమైనా బాహుబలి తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన ప్రభాస్ కి ఈ సినిమా ఏకంగా విందు భోజనాన్ని తినిపించిందని చెప్పాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు