Ram Charan: చైతూ లవర్ తో ఏడడుగులు వేసిన చెర్రీ.. వీడియో వైరల్..!

RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రామ్ చరణ్ ఒకవైపు సినిమాలతో మరొకవైపు పలు రకాల యాడ్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే..ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఒకవైపు ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా.. మరొకవైపు ఈయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే.. నాగచైతన్య లవర్ తో రామ్ చరణ్ ఏడడుగులు వేశారు అంటూ నెట్టింట ఒక వార్త మరింత హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం.

తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ శోభిత ధూళిపాళ తో రామ్ చరణ్ ఏడడుగులు వేసినట్టు.. అందుకు సంబంధించిన ఒక పెళ్లి వీడియో కూడా వైరల్ గా మారింది. మరి ఈ వీడియో వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. శోభిత – రామ్ చరణ్ ఇద్దరు కలసి ఒక ఫేమస్ క్లాతింగ్ కంపెనీ యాడ్ లో నటించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోలో రామ్ చరణ్.. శోభిత ను పెళ్లి చేసుకున్నట్లుగా చూపించారు.

ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ రియాక్షన్ అదుర్స్ అంటూ కూడా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాడ్ విషయానికి వస్తే రామ్ చరణ్ చాలా సింపుల్ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించారు. వరుడు గా ముస్తాబయి ధోతీ పంచె కట్టుకొని మరి ఈ వీడియోలో కనిపించారు. శోభిత విషయానికి వస్తే వధువుగా చాలా అందంగా ముస్తాబయి పింక్ కలర్ చీరలో బుట్ట బొమ్మ లాగా కనిపిస్తోంది.

- Advertisement -

ఈ యాడ్లో ఇద్దరికీ ఎలాంటి డైలాగ్స్ లేకపోయినప్పటికీ తమ హావభావాలతోనే ఈ ఎమోషనల్ సీన్స్ ను పండించారని తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ లో ఉండే డైలాగులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఈ యాడ్లో ఇద్దరికీ కూడా వివాహం జరిగినట్లుగా చూపించారు. ముఖ్యంగా పెళ్లి పట్టు వస్త్రాల ప్రమోషన్స్ లో భాగంగా ఈ యాడ్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక శోభిత విషయానికి వస్తే.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకీ గూఢచారి సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యింది.. ఆ తరువాత మేజర్, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాలలో నటించి మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దక్షిణాది సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్లో పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా బోల్డ్ పాత్రలలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది.మోడల్గా తన కెరీర్ ని మొదలుపెట్టిన శోభిత గతంలో ఎన్నో యాడ్స్ లో కూడా నటించింది. ఇక సినిమాలలోకి వచ్చిన తర్వాత యాడ్స్ కి గుడ్ బై చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు రాంచరణ్ తో కలిసి ఇలాంటి యాడ్ లో నటించడంతో ఈమె అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు