Salaar : ప్రభాస్ రోల్ ను మిస్ అయిన స్టార్ ఎవరో తెలుసా?

డార్లింగ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” ఈరోజు థియేటర్ లోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఏ థియేటర్లో చూసినా “సలార్” సందడే కనిపిస్తోంది. అయితే నిజానికి ఈ సినిమాను ప్రభాస్ కోసం రాసుకోలేదట ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ముందుగా మరో తమిళ హీరోను అనుకున్నారట. మరి ప్రభాస్ వద్దకు ఆ కథ ఎలా చేరింది? ఇంతకీ ఈ సినిమాను మిస్ చేసుకున్న ఆ తమిళ స్టార్ ఎవరు? అంటే…

ప్రస్తుతం దేశవ్యాప్తంగా “సలార్” మేనియా నడుస్తోంది. ప్రభాస్ ఈ సినిమాతో రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు ఇప్పటికే సినిమాను చూసినవారు. ఈ నేపథ్యంలోనే సలార్ మూవీ కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి సలార్ మూవీలో ప్రభాస్ రోల్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరు అన్న విషయం.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముందుగా ఈ సినిమాను తమిళ స్టార్ హీరో సూర్యతో చేయాలని అనుకున్నారట. ఈ మేరకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న తరుణంలోని ప్రశాంత్ నీల్ కు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒకరు ప్రభాస్ పేరును సూచించారట. ఆ పాత్రకు ప్రభాస్ అయితే సరిగ్గా సరిపోతాడని చెప్పడంతో ప్రశాంత్ ఆలోచన కూడా మారిపోయిందట. ఒక రోజంతా తన స్టోరీలో ప్రభాస్ ను ఊహించుకున్న తర్వాత కన్విన్స్ అయినా ప్రశాంత్ తన స్టోరీ తో ప్రభాస్ ను కలిశారట. ఆయన కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సలార్ పట్టాలెక్కిందన్నమాట.

- Advertisement -

ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం “సలార్” మూవీ సూర్య చేయాల్సింది కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యి, ప్రభాస్ వద్దకు చేరింది అనే వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తలపై ప్రశాంత్ నీల్ సైలెంట్ గా ఉన్నారు. ఆయన మౌనంతో ప్రస్తుతం నడుస్తున్న రూమర్స్ నిజం అనుకుంటున్నారు నెటిజన్లు. ఇక సూర్య యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

అయితే ప్రభాస్ తో పోల్చుకుంటే ప్రస్తుతం సూర్యకి ఉన్న మార్కెట్ తక్కువే. ప్రభాస్ కు పాన్ ఇండియా రేంజ్ లో మంచి మార్కెట్ ఉండడంతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ప్రస్తుతం “సలార్” మూవీ ఎలాంటి రికార్డుల క్రియేట్ చేయబోతోంది అనే విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. గత కొంతకాలంగా హిట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ప్రభాస్ మొత్తానికి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు అని అంటున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు