Animal: ఆల్ఫా మేల్, బేటా మేల్… డైరెక్టర్ ను టార్గెట్ చేసిన స్క్రీన్ రైటర్

మోస్ట్ వైలెంట్ మూవీ “యానిమల్” ఎంత పెద్ద హిట్ అయిందో, అంతే పెద్ద వివాదంగా మారింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన “యానిమల్” మూవీపై రోజుకో వివాదం బయటపడుతుంది. తాజాగా ఈ సినిమా స్క్రీన్ రైటర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా సుదీర్ఘ పోస్టులో తన అసంతృప్తిని వెళ్లగక్కింది. సందీప్ “యానిమల్”కు రైటర్ గా తానే పని చేశాను అంటూ చెప్పుకున్నాడు. కానీ తనకు దక్కాల్సిన స్క్రీన్ రైటర్ క్రెడిట్ ఇవ్వలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన “యానిమల్” మూవీ డిసెంబర్ 1న భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇక ఇండస్ట్రీని షేర్ చేసిన ఈ మూవీపై రోజుకో వివాదం బయటపడుతోంది. తాజాగా ఈ మూవీకి స్క్రీన్ రైటర్ గా పని చేసిన గజల్ ధాలీవాల్ తనకు దక్కవలసిన క్రెడిట్ దక్కలేదంటూ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. గజల్ సోషల్ మీడియా పోస్టులో తాను యానిమల్ పార్టీలో కాస్త లేటుగా జాయిన్ అయ్యానని, పలువురు క్రిటిక్స్ ఇప్పటికే ఈ సినిమాలో ఉన్న స్త్రీ ద్వేషం, పురుష అహంకారం వంటి అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేశారని, వాటి గురించి మాట్లాడడానికి ఇంకేమీ లేదని చెప్పుకొచ్చింది. కానీ స్క్రీన్ రైటర్ కోణంలో స్క్రీన్ వెనకాల పనిచేసిన ఒక వ్యక్తి గురించి మాత్రం తాను చెప్పాలనుకుంటున్నాను అంటూ స్టార్ట్ చేసింది.

తమ సినిమాలకు ఇతర స్క్రీన్ ప్లే రైటర్స్, డైలాగ్స్ పని చేసినప్పటికీ చాలామంది ఫిలిం మేకర్స్ టైటిల్ కార్డు పై తామే రైటర్స్ అంటూ క్రెడిట్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ ఫిలిం మేకర్స్ అందరూ పవర్ కావాలి అనే కోరికలు మునిగితేలుతుంటారు. డైరెక్టర్ అనే పవర్ఫుల్ పదవి తమ చేతిలో ఉన్నప్పటికీ రైటర్ అని క్రెడిట్ ఇచ్చుకోవడమే గొప్పగా భావిస్తారు. నిజానికి ఒక రైటర్ గా తమకు క్రెడిట్ దక్కాలి అనుకునేవారు కో రైటర్, డైరెక్టర్, ఎడిటర్ అని చెప్పుకోవచ్చు. లేదంటే స్టోరీ, ఎడిటింగ్, డైరెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు.

- Advertisement -

కానీ రైటర్ క్రెడిట్ ఇచ్చుకోవడమే వాళ్లకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది అంటూ ఇన్ డైరెక్ట్ గా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై మండి పడింది. యానిమల్ సినిమాలో తనకి నచ్చని అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ సినిమాలో హీరో తనకు తాను ఆల్ఫా మేల్ అని చెప్పుకునే సీను గుర్తు చేస్తూ, తన లాంటి అబ్బాయిలను కలవడానికి మాత్రమే అబ్బాయిలు ఇష్టపడతారని హీరో చెప్పాడు.

మరి బేటా మేల్ సంగతి ఏంటి? వాళ్లకు కూడా కోరికలు ఉంటాయి కదా? ఆల్ఫా మెయిల్ మాత్రమే ఒక అమ్మాయిని తన వశం చేసుకోవాలని ఎలా అనుకుంటాడు అంటూ యానిమల్ లో తనకి నచ్చని అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించింది గజల్. అంతేకాకుండా తనలాంటి రైటర్స్ కు క్రెడిట్ ఇవ్వడాన్ని ఫిలిం మేకర్ భారంగా భావిస్తారని రాసుకు వచ్చింది. మరి ఈ విషయంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎలా స్పందిస్తాడు ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు