NTR: సౌత్ నుంచి ఆ ఘనత సాధించిన మొట్టమొదటి హీరో ఎన్టీఆర్..!!

RRR సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను అందుకున్నారు.. ఈ చిత్రాన్ని రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా.. ఇందులో రామ్ చరణ్ కూడా మరో ప్రధాన పాత్రలో నటించారు. అంతేకాదు ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా రావడంతో మరింత పాపులారిటీ సంపాదించారు రామ్ చరణ్, ఎన్టీఆర్ , రాజమౌళి. ఈ సినిమా చూసిన హాలీవుడ్ నటులు కూడా వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇప్పటికే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లిస్టులో స్థానాన్ని సైతం సంపాదించుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మరొక అరుదైన ఘనతను కూడా సాధించినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ గ్లోబల్ మీడియాలో దాదాపుగా 500 మంది అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల పేర్లలో ఎన్టీఆర్ పేరు కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులలో ఎన్టీఆర్ పేరు రావడంతో అభిమానుల సైతం తెగ సంబర పడిపోతున్నారు.

ముఖ్యంగా సౌత్ నుంచి ఈ లిస్టులో మొట్టమొదటి స్థానం అందుకున్నది జూనియర్ ఎన్టీఆర్ కావడమే విశేషమని చెప్పవచ్చు. దీంతో పలువురు నెటిజన్లు, అభిమానులు సైతం ఎన్టీఆర్ పై ప్రశంసలు అందిస్తూ ఉన్నారు.. ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివతో కలిసి దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తన తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు ఎన్టీఆర్.

- Advertisement -

కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటున్నారు.ఇక వచ్చే ఏడాది బాలీవుడ్లో వార్ -2 చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా అయిపోయిన వెంటనే దేవర-2 చిత్రంతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరొక చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 2025 వరకు ఎన్టీఆర్ ఫుల్ డేట్లు అన్నీ కూడా పలు సినిమాలకు విచ్చేసినట్లుగా తెలుస్తుంది… ఏది ఏమైనా సౌత్ నుంచి అమెరికాను మ్యాగ్జైన్ గ్లోబల్ లో పేరు సంపాదించిన ఏకైక హీరో ఎన్టీఆర్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులకి ఆనందానికి అవధులు లేవు.

 

Check out Filmify Telugu for Tollywood Movie news updates, the latest Kollywood news, Movie Reviews and ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News and gossip in Tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు