Salaar Part 2: సెకండ్ పార్ట్ కు పవర్ ఫుల్ టైటిల్

“సలార్” పార్ట్ 2 కు పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. చాలాకాలం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూసిన “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. కానీ ప్రభాస్ అభిమానులను మాత్రం సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ ఉర్రూతలూగిస్తున్నాయి. ఫస్ట్ డే ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక మూవీ ఎండింగ్ లో రెండో పార్ట్ టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్.

సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులంతా అందులో ఉన్న హైలెట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. “సలార్” మూవీలో ఉన్న ఫైట్ సీక్వెన్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అలాగే ప్రభాస్ కటౌట్ కూడా అదిరిపోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” పేరుతో ఈరోజు రిలీజ్ అయిన ఈ మూవీలోని రెండో పార్ట్ పేరును కూడా ప్రకటించి ప్రేక్షకులను థ్రిల్ చేశాడు ప్రశాంత్. “శౌర్యంగ పర్వం” అనే టైటిల్ ను సలార్ పార్ట్ 2 కు ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక క్లైమాక్స్ అద్భుతంగా ఉందని, పార్ట్ 2 కు ఇచ్చిన లీడ్ బాగుందని కామెంట్ చేస్తున్నారు. ఇక టైటిల్ తోనే “సలార్” సిరీస్ లో రాబోతున్న రెండవ భాగంపై తీవ్రస్థాయిలో అంచనాలను పెంచేసింది టీం.

కాగా ప్రస్తుతం “సలార్” మేనియాతో థియేటర్లు మొత్తం ఊగిపోతున్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత చాలా రోజుల అనంతరం కాలర్ ఎగరేసుకుని తిరిగే సినిమాను ప్రభాస్ కు ఇచ్చాడు ప్రశాంత్ నీల్ అంటూ డార్లింగ్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సలార్ మూవీస్ సాటిలైట్ రైట్స్ ను భారీ ధరకు స్టార్ మా దక్కించుకున్నట్టు సమాచారం. 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల వరకు వసూలను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -

అందులో 70 కోట్ల కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లోనే ఉండబోతున్నట్టు క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఇక తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కలిపి 48.50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి అంటే ఈ మూవీ గురించి ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు “సలార్” మేనియాలో మునిగితేలుతున్నారు. యంగ్ హీరో శ్రీవిష్ణు శ్రీరాములు థియేటర్లో “సలార్” మూవీని వీక్షించి, ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేశాడు. ఇక నవీన్ పోలిశెట్టి బాక్స్ ఆఫీస్ బద్దలై పోతుంది అంటూ ట్వీట్ వేశాడు. మొత్తానికి సెలబ్రిటీలు సామాన్యులు అన్న తేడా లేకుండా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా “సలార్” మూవీని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు