Tollywood Drug Case: దర్శకుడు క్రిష్ అరెస్ట్ అవబోతున్నాడా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి చెందిన పలువురు నటీనటులతో పాటు దర్శకనిర్మాతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడంతో ఈ ఇష్యూ టాలీవుడ్ లో సెన్సేషన్ అయింది. అయితే తాజాగా ఈ కేసులు మరింత ముదురుతున్నాయి. తీగ లాగితే డొంక కదులుద్ది అన్నట్టు బడా ఫ్యామిలీ వారసులే కాదు, టాలీవుడ్ లో మంచి పేరున్న వారికి కూడా ఇప్పుడు డ్రగ్ కేసు మెడకు పట్టుకుంది. ఈ క్రమంలో రాడిసన్ పబ్ లో డ్రగ్స్ పార్టీ కేసులో ప్రముఖ దర్శకుడు క్రిష్ కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారగా, ఇప్పటికే క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చి విచారణ జరిపినట్టు తెలిసింది.

డైరెక్టర్ క్రిష్ కూడా…?
ఇక దర్శకుడు క్రిష్ ముందుగానే కోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ తో పాటు డ్రగ్స్ కేసులో అనుమానితులుగా ఉన్న రఘుచరణ్ అట్లూరి , సందీప్ లు కూడా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోని డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ కేసుకి తనకి ఏమాత్రం సంబంధం లేదని వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్ వల్లే నిందితుడిగా చేర్చారని.. తాను డ్రగ్స్ తీసుకున్నానడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్రిష్ చెప్పుకొచ్చాడు.

ల్యాబ్‌కి క్రిష్‌ శాంపిల్స్…
అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడని సమాచారం. ఈ క్రమంలో డైరెక్టర్ క్రిష్ పోలీసుల నోటీసులకు స్పందించి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాక, కాసేపు విచారణలో కూడా ఉన్నాడు. ఇక డ్రగ్ కేసులో భాగంగా డ్రగ్స్ టెస్ట్ ల కోసం బ్లడ్ శాంపిల్స్, ఇంకా యూరిన్ శాంపిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. గచ్చిబౌలి పోలీసుల పరిధిలో దాదాపు నాలుగు గంటల విచారణ జరిపి క్రిష్ దగ్గరి నుండి స్టేట్ మెంట్ ఇంకా శాంపిల్స్ తీసుకుని పంపడం జరిగింది.

- Advertisement -

ఇక క్రిష్ యొక్క బ్లడ్ యూరిన్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పోలీసువారు పంపగా, ఆ టెస్ట్ లో గనక పాజిటివ్ అని తేలితే క్రిష్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే క్రిష్ కి సంబంధించిన ఈ వ్యవహారం పై క్రిష్ విచారణలో గోప్యత పాటిస్తున్నారని తెలుస్తుంది. ఒకవేళ క్రిష్ గనక అఫిషియల్ గా అరెస్ట్ అయితే టాలీవుడ్ లో సంచలనం అవుతుంది. సెట్స్ పై ఉన్న భారీ ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు ఆగిపోతుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు