Overthinking: మీరు కూడా ఓవర్ థింకరా…? ఈ సింపుల్ టిప్స్ తో ఫుల్ స్టాప్ పెట్టండి

ఏదైనా ఒక విషయం గురించి పదే పదే ఆలోచించడం వల్ల అనవసరపు ఆందోళనకు లోనవుతారు. అతిగా ఆలోచించడం అనేది ఒక అనారోగ్యకరమైన అలవాటు. దానివల్ల నెగిటివిటీ పెరుగుతుంది. అలాగే గతం గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి చింతించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఓవర్ థింకింగ్ వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు. అతిగా విశ్లేషించి సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. దానివల్ల టెన్షన్ కూడా పెరిగిపోతుంది. ఓవర్ థింకింగ్ అనేది మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. ఒకవేళ మీరు కూడా ఓవర్ థింకింగ్ తో బాధపడుతూ, ఆ సమస్య నుంచి బయట పడలేక సతమతం అవుతున్నారా? ఈ సింపుల్ టిప్స్ తో ఫుల్ స్టాప్ పెట్టేయండి.

1. అవేర్నెస్

Tips to get out of overthinking
అతిగా ఆలోచించే అలవాటును మార్చుకోవాలంటే అవగాహన ముఖ్యం. అలా ఆలోచిస్తున్నారు అని మీరు గ్రహించగలగాలి. ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టు ఎలా తెలుస్తుంది అంటే… ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎక్కువగా సందేహాలు రావడం, ఒత్తిడిగా అనిపించడం, ఆతృతగా అనిపిస్తే వెంటనే ఆలోచించడం మానేయండి. ఇవే ఓవర్ థింకింగ్ లక్షణాలు. కొంత సమయం తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించండి.

- Advertisement -

2. తప్పొప్పులను పక్కన పెట్టండి

Tips to get out of overthinking
సాధారణంగా ఓవర్ థింకింగ్ వల్ల భయం పెరుగుతుంది. నెగిటివ్ విషయాలపైన ఫోకస్ చేసినప్పుడు మైండ్ పని చేయదు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే వెంటనే నెగిటివ్ గా ఆలోచించడం పక్కన పెట్టేసి, పాజిటివ్ పర్సెప్షన్ లో ఆలోచించండి.

3. ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి

Tips to get out of overthinking
పాజిటివ్ మైండ్ సెట్ తో సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తే ఓవర్ థింకింగ్ అనేది మన దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉండదు. ముఖ్యంగా ఇష్టమైన హాబీలపై దృష్టి పెట్టండి. డాన్స్, వ్యాయామం, సంగీతం, డ్రాయింగ్, పెయింటింగ్ వంటి అలవాట్లు ఓవర్ థింకింగ్ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయి.

4. పర్ఫెక్షన్ గురించి వెయిటింగ్ వద్దు

Tips to get out of overthinking
పర్ఫెక్షన్ అనేది అన్ని విషయాల్లోనూ సాధ్యం కాదు. నిజానికి అది అసాధ్యం, పైగా బలహీన పరుస్తుంది. పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ముందుకు కదల్లేరు అని గుర్తుపెట్టుకోండి.

5. భయాన్ని పక్కన పెట్టండి

Tips to get out of overthinking
ఫెయిల్ అవుతామేమో అని భయపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఫెయిల్యూర్ అనేది మరొక కొత్త ప్రయత్నానికి దారి అని అర్థం చేసుకోవాలి. ప్రతి అవకాశం మరో కొత్త ప్రారంభానికి దారితీస్తుంది. అలాగే ఒక్కసారి ఫెయిల్ అయితే ప్రతిసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు అని గుర్తుపెట్టుకోండి.

6. ఆలోచనలకు హద్దులు పెట్టండి

Tips to get out of overthinking
ఏదైనా ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు టైమర్ ని సెట్ చేసి పెట్టుకోండి. ఆ ఐదు నిమిషాల్లో ఆలోచించండి, విశ్లేషించండి, అవసరమైతే బాధపడండి. ఒక్కసారి టైం అయిపోగానే మరో 10 నిమిషాలు ఒక పెన్, పేపర్ తీసుకొని మీకు ఆందోళన కలిగించే, మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే విషయాలను రాసుకోండి. ఆ తర్వాత ఆ పేపర్ ను చింపి పారేయండి.

7. భవిష్యత్తు మీ చేతుల్లో లేదన్నది నిజం

భవిష్యత్తు ను ఎవ్వరూ ఊహించలేరు. కాబట్టి ప్రస్తుతం పై దృష్టి పెట్టండి. సంతోషంగా గడపండి.

8. యాక్సెప్ట్ చేయండి
ఏదైనా ఒక పనిపై మీ వంతు కృషి చేసిన తర్వాత వచ్చే ఫలితం ఏదైనా అంగీకరించండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు