Amani: సౌందర్య – జగపతిబాబు మధ్య ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన ఆమని..!

టాలీవుడ్ సీనియర్ జోడీలలో బెస్ట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మందిలో జగపతిబాబు – సౌందర్య జోడి కూడా ఒకటి.. అయితే గతంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు గట్టిగా వినిపించాయి.. వాస్తవానికి వీరిద్దరూ కలిసి పలు చిత్రాలు చేశారు.. పైగా ఒక సందర్భంలో సౌందర్య తో తనకు ఎఫైర్ ఉందని జగపతిబాబు కూడా వెల్లడించడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని అందరూ అనుకున్నారు.. అయితే అసలు వీరి మధ్య ఏం జరిగింది అన్న విషయాన్ని సౌందర్య స్నేహితురాలు.. ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఆమని చెప్పుకొచ్చింది.

సౌందర్య విషయానికి వస్తే..
సావిత్రి తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో అంతటి పేరు సంపాదించుకున్న నటీమణి సౌందర్య అతి చిన్న వయసులోనే మరణించడం అందరిని కలవరపాటుకు గురిచేసింది. ముఖ్యంగా ఈమె అందం , నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. సౌందర్యను తమ ఇంట్లో అమ్మాయిగా భావించేవారు. అంతేకాదు హీరోలకు మించిన స్టార్డం ఆమె అనుభవించింది.. అలా ఒకపక్క చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటిస్తూనే.. మరొకవైపు జగపతిబాబు, శ్రీకాంత్ వంటి టైర్ -2 హీరోల పక్కన కూడా సందడి చేసింది. ముఖ్యంగా జగపతిబాబుతో ఎక్కువ సినిమాలు చేసింది సౌందర్య.

జగపతిబాబు , సౌందర్య కలిసి నటించిన చిత్రాలు..
సౌందర్య , జగపతిబాబు కాంబినేషన్లో వచ్చిన చిత్రాల విషయానికి వస్తే వీరిద్దరి కాంబినేషన్లో భలే బుల్లోడు, చిలకపచ్చ కాపురం, దొంగాట, ప్రియరాగాలు, అంతఃపురం వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశాయి.. అలా వీరిద్దరి జంటకి అప్పట్లో అభిమానులు ఎక్కువగా ఉండేవారు..

- Advertisement -

జగపతిబాబు – సౌందర్య మధ్య ఎఫైర్..
ఇక అలా వరుస సినిమాలలో చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య ఏదో ఉందనే ఎఫైర్స్ రూమర్స్ గుప్పూమన్నాయి. అప్పటికే జగపతిబాబు కు పెళ్లయి పిల్లలు ఉన్నారు.. అయినప్పటికీ సౌందర్యన ఇంకో వివాహం చేసుకోబోతున్నాడు అంటూ కథనాలు వెలబడ్డాయి.

రూమర్స్ పై స్పందించిన ఆమని..
ఈ విషయాలపై ఆమని మాట్లాడుతూ.. సౌందర్య, జగపతిబాబు మధ్య అందరూ అనుకుంటున్నట్లు అలాంటి ఎఫైర్ బంధం ఏమీ లేదు .. కలిసి ఎక్కువ సినిమాలు చేయడం వల్లే ఎఫైర్ రూమర్స్ వచ్చాయి.. సౌందర్యకు కుటుంబం తర్వాతే ఎవరైనా.. ఆమె చాలా మంచిది సౌందర్య తండ్రి చనిపోయినప్పుడు ఫోన్ చేసి రమ్మని ఏడ్చింది.. తన తండ్రి దూరం అయ్యాక తనకు అన్ని అన్నయ్యే..అన్నయ్య మాట వినేది.. ఆయన చెప్పాడనే ఒక వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుంది.. అంతే తప్ప జగపతిబాబు – సౌందర్య మధ్య ఎటువంటి ఎఫైర్స్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

సౌందర్య తో ఎఫైర్ నిజమే అన్న జగపతిబాబు..
సౌందర్య తో తనకు ఎఫైర్ ఉందని జగపతిబాబు ఒక సందర్భంలో ఒప్పుకోవడం విశేషం.. అయితే ఆ ఎఫైర్ మీరు అనుకుంటున్నట్లు శారీరక సంబంధం కాదు.. ఎవరికి అర్థం కాని ఒక అనుబంధం తమ మధ్య ఉందని అప్పట్లో జగపతిబాబు తెలిపారు..

సౌందర్య మరణ వార్త:
వరుస సినిమాలు చేస్తున్నప్పుడే బిజెపి పార్టీలో చేరిన ఈమె ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుండి కరీంనగర్ వెళ్తుండగా ..2004 లో విమాన ప్రమాదంలో మరణించింది. ఆమెతో పాటు ఆమె అన్నయ్య కూడా అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు