Dil Raju: రివ్యూ కల్చర్ మారాలి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. దిల్ సినిమాతో నిర్మాతగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అడుగు పెట్టిన దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు. ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే కుటుంబ సమేతంగా థియేటర్ కి వెళ్లి ఆ సినిమాను చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఫ్యామిలీ సినిమాలకు పర్ఫెక్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా అనిపించుకునే వాళ్ళు.

ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన శ్రీనివాస కళ్యాణం సినిమా మినహా ఇస్తే మిగతా సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించాయి. ఈ బ్యానర్ లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి వంద రోజులు పైగా చాలా సెంటర్లో ఆడింది. అలానే ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమా కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించి మంచి కలెక్షన్స్ రాబెట్టింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ను కాబట్టి ప్రభాస్ ను మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో సినిమాలు చూసే ఆడియన్స్ 9 సెట్ కూడా మారింది అని చెప్పొచ్చు. ఫ్యామిలీ సినిమాలకు అంతగా ఆదరణ చూపించడం లేదు ప్రస్తుతం ఉన్న ఆడియన్స్. సిల్లీ కామెడీ, పంచెస్ ఇలాంటి సినిమాలు అన్నిటికీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చేసే విధానం సినిమా చూసే విధానం రెండూ కూడా ఈ మధ్య కాలంలో మారిపోయాయని చెప్పొచ్చు. అయితే ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకు కానీ ఆ సినిమా గురించి కంప్లీట్ టాక్ తెలిసేది కాదు. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా తరుణంలో ఒక సినిమా ఫస్ట్ షో పడగానే ఆ సినిమా జాతకం ఏంటో బయట పెట్టేస్తున్నారు కొంతమంది.

- Advertisement -

తెలుగులో సినిమా రిలీజ్ అవ్వని కంటే ముందు అమెరికాలో షూస్ చూసిన కొంతమంది యూట్యూబ్లో ఆ సినిమా యొక్క రివ్యూ పెట్టడం ఆ సినిమా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం అనేది రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువగా మారిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ఇది ఒక కమర్షియల్ గా హిట్ అవుతుంది అనుకున్న తరుణంలో ఈ సినిమాకి మొదటగా నెగిటివ్ టాక్ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత మహేష్ బాబుకు ఉన్న ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ వలన ఈ సినిమా ఎట్టకేలకు బ్రతికి బయటపడింది.

ఇకపోతే ఇప్పుడు దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ సినిమాకి అదే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి సినిమా కొంత మేరకు బాగానే ఉంది చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ నుంచి ఈ సినిమా పైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. చాలామంది విజయ్ దేవరకొండను పర్సనల్ అటాక్ కూడా చేయడం మొదలుపెట్టారు. సంబంధం లేని విషయాలను సంబంధం లేని స్టేట్మెంట్స్ ను ఈ సినిమాకి అంటగట్టి ఈ సినిమాపై విషప్రచారం చేయడం మొదలుపెట్టారు.

అయితే వీటన్నిటికీ దిల్ రాజు స్పందించారు ఈ సినిమా పైన నెగిటివ్ టాక్ చేస్తున్న వాళ్లపై యాక్షన్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేసింది. ఈ సినిమాపై దిల్ రాజు కూడా ఒక అడుగు ముందుకేస్తూ మూడు రోజుల వరకు రివ్యూస్ రాయకుండా ఉండే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ రోజుల్లో ఒక సినిమా రివ్యూ అనేది బయటకు రాకుండా ఆపడం అనేది మామూలు విషయం కాదు. ఎవరికి వారే వ్యక్తిగతంగా ఆ సినిమా గురించి టాక్ బయట పెడుతూ ఉంటారు. ఏదేమైనా దిల్ రాజు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలి అంటే కొంతమేరకు వేచి చూడక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు