HBD Allu Arjun: గంగోత్రి నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ సినీ ప్రస్థానం..!

HBD Allu Arjun.. అల్లు వారసుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరో లిస్ట్ లో చేరిపోయారు. సూపర్ ఎనర్జిటిక్ డాన్సులతో , వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈయన.. యూత్ ఐకాన్ గా పేరు దక్కించుకున్నారు.. ఇక ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని మనకు తెలియని విషయాలు అలాగే గంగోత్రి సినిమా నుంచి పుష్ప వరకు ఆయన సినీ ప్రస్థానం ఎలా కొనసాగింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఐకాన్ స్టార్ గా గుర్తింపు..
చేసినవి కొన్ని చిత్రాలే అయినా తనదైన నటన, డాన్స్, ఫైట్స్ , మేనరిజంతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్.. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు కేరళ చలనచిత్ర పరిశ్రమలో కూడా తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకున్న దేశముదురు ఈయన.. తెలుగులో తన సిక్స్ ప్యాక్ తో యువతను ఆకట్టుకొని స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించారు. 2022లో పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా కూడా పేరు దక్కించుకున్నారు.

అల్లు అర్జున్ సినీ ప్రస్థానం..
ఈ రోజున అల్లు అర్జున్ 42వ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.. అల్లు రామలింగయ్య మనవడిగా , నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ముఖ్యంగా మెగా నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. చిన్న వయసులోనే ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి నటించిన విజేత సినిమాలో బాల నటుడుగా నటించారు. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం సినిమాలో కూడా నటించారు. మళ్లీ చిరంజీవి నటించిన డాడీ చిత్రంలో ఒక చిన్న పాత్రలో మెరిశారు అల్లు అర్జున్.

- Advertisement -

కేరళలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్..
డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా పేరు సంపాదించారు. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 19 ఏళ్ల కెరియర్ లోనే 20 సినిమాలను పూర్తి చేశారు అల్లు అర్జున్. గంగోత్రి సినిమా తర్వాత ఆర్య సినిమాలో నటించాక..ఈ సినిమా కేరళలో ఎన్నో థియేటర్లలో వంద రోజులు ఆడింది. ఇక ఈ సినిమానే అక్కడ బన్నీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్నో అవమానాలను, ట్రోల్స్ ను కూడా ఎదుర్కొన్నారు బన్నీ.. అయితే అప్పుడు తిట్టినవాళ్లు ఇప్పుడు అల్లు అర్జున్ ను చూసి వావ్ అంటున్నారు. అల్లు అర్జున్ గంగోత్రి నుంచి పుష్ప సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా విభిన్నమైన మేనరిజమ్ తో ప్రేక్షకులను అలరించారు.

అల్లు అర్జున్ ఇష్టాలు..
పుష్ప సినిమాతో హిందీలో 100 కోట్ల రూపాయల గ్రాస్ ను అందుకున్నారు. అల్లు అర్జున్ కు కేరళలో మంచి క్రేజ్ ఉన్నది.. అల్లు అర్జున్ ఇష్టాల విషయానికి వస్తే..క ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం.. యాక్టింగ్ , డాన్సింగ్ తో పాటు వీటిని ఇష్టపడతారట. సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో కుటుంబానికి కూడా అంతే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అల్లు అర్జున్ నటించిన కీలకమైన పాత్రలలో గోన గన్నారెడ్డి పాత్రకు మంచి పేరు వచ్చింది. అల్లు అర్జున్ సోదరులలో అల్లు శిరీష్ హీరోగా ఉండగా.. మరొక బ్రదర్ బాబి నిర్మాతగా కొనసాగుతున్నారు.

అల్లు అర్జున్ సినిమాలు..
ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్.. ఈ సినిమాను ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు