Pushpa The Rule : పుష్ప2 సెట్స్ లో దేవి నాగవల్లి బర్త్ డే.. ఆ వార్త నిజమే!

Pushpa The Rule : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజి సినిమాల్లో పుష్ప ది రూల్ ఒకటి. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు సౌత్ నుండి అన్నిటికంటే ఈ సినిమా కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. మూడేళ్ళ కింద సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో అల్లు అర్జున్ మాస్ అప్పీరెన్స్ తో మూవీ లవర్స్ ని ఫిదా చేసారు. అన్నిటికి మించి ఈ సినిమా పాటలతో డిఎస్పీ రచ్చ చేసాడని చెప్పాలి. ఇక రెండో పార్ట్ పై అంతకు మించి అంచనాలు పెంచేసింది. కానీ రెండో పార్ట్ మొదలుపెట్టడానికే ఏడాది సమయం తీసుకున్న సుకుమార్, స్టార్ట్ చేసాక మాత్రం ఎక్కడా తగ్గకుండా జెట్ స్పీడ్ తో సినిమాని పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు, రిలీజ్ చేసిన రెండు మూడు సాలిడ్ స్టిల్స్ తో ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో అంచనాలని పెంచేసాయి. ఫైనల్ గా ఇప్పుడు టీజర్ తో రచ్చ చేయడానికి రెడీ అయ్యారు. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ఏప్రిల్ 8న పుష్ప మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పుష్ప సెట్స్ నుండి ఓ అరుదైన అప్డేట్ పై క్లారిటీ వచ్చింది.

పుష్ప సెట్స్ లో నాగవల్లి బర్త్ డే..

పుష్ప ది రూల్(Pushpa The Rule) ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా టీజర్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ లో మేకర్స్ బిజీ గా ఉండగా, తాజాగా సెట్స్ నుండి ఓ వీడియో రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమా గురించి చాలా మందికి తెలీని ఒక విషయంపై క్లారిటీ వచ్చింది. తాజాగా వచ్చిన వీడియోలో ప్రముఖ జర్నలిస్ట్ యాంకర్ దేవి నాగవల్లి బర్త్ డే ని సుకుమార్, అనసూయ సహా సెట్స్ లో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెలెబ్రేట్ చేసారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎందుకంటే పుష్ప ది రూల్ సినిమాకి యాంకర్ దేవి నాగవల్లి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా దర్శకత్వ శాఖలో పని చేస్తుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ చాలా మంది ఈ వార్తలు నమ్మలేదు. కానీ తాజాగా ఆమె బర్త్ డే పిక్స్ వైరల్ కావడంతో ఈ సినిమాలో దేవి నాగవల్లి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉందన్న ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. ఇక యాంకర్ దేవి నాగవల్లి ప్రముఖ ఛానెల్ లో జర్నలిస్ట్ గా ఫేమస్ కాగా, పలుమార్లు ట్రోలింగ్ కి కూడా గురయిన విషయం తెలిసిందే.

పుష్ప టీజర్ అప్డేట్..

ఇదిలా ఉండగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప ది రూల్ టీజర్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ కానుంది. ఏప్రిల్ 8న ఉదయం 11.07 నిమిషాలకు టీజర్ రిలీజ్ కానుండగా, పాన్ ఇండియా వైడ్ గా కొన్ని రికార్డులను బ్రేక్ చేయడానికి టీజర్ రెడీ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఈ టీజర్ నుండి మూవీ ప్రమోషన్స్ అఫిషియల్ గా స్టార్ట్ చేస్తారని చెప్పొచ్చు. ఇక ఒక్కో నెలలో కనీసం రెండు అప్డేట్స్ తో సుకుమార్ రచ్చ చేస్తారట. ప్రస్తుతం పుష్ప సెట్స్ లో టెక్నికల్ టీం తో బిజీ గా ఉన్నాడు సుకుమార్. ఇక సుకుమార్ పుష్ప ది రూల్ పూర్తయ్యాక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తీస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు