Tollywood : వంద కొట్టిన మీడియం రేంజ్ హీరోలు.. ఇంకా వీళ్ళ ఛాన్స్?

Tollywood : టాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయిందని తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో పదిహేనేళ్ల కింద మగధీర తో మొదలైన వంద కోట్ల రచ్చ ఇప్పుడు స్టార్ హీరోలకు కామన్ అయిపోగా, మీడియం రేంజ్ హీరోలకు కలగా ఉండగా, ఆ కలను ఒక్కొక్కరుగా నెరవేచుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఆ క్లబ్ లో చేరిపోగా ఇప్పటివరకు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయిన మీడియం రేంజ్ హీరోలు వీళ్ళే అని తేలింది. అందులో చిన్న హీరోలు కూడా అనూహ్యంగా చేరిపోయారు. ఇక టాలీవుడ్ లో టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, మ‌హేష్‌ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల సినిమాలకు ఓపెనింగ్స్ లోనే వంద‌కోట్లు ప‌క్కా అనేయచ్చు. వీళ్ళే కాక మెగాస్టార్ చిరంజీవి సినిమాలు కూడా ఓపెనింగ్స్ తోనే వంద కోట్ల క్లబ్ లో చేరతాయి. ఇక ఇప్ప‌టికే ఆ హీరోల నుంచి రిలీజ్ అయిన చాలా సినిమాలు వంద‌ల కోట్లు వ‌సూళ్లు సాధించాయి. ఆ త‌ర్వాత లిస్ట్ లో ఉన్న సెంచ‌రీ స్టార్లు ఎవ‌రంటే..

సెంచరీ కొట్టిన మీడియం రేంజ్ హీరోలు..

ముందుగా విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా చెప్పాలి. ఆరేళ్ళ కింద వచ్చిన సినిమా 70 కోట్ల షేర్ 130 కోట్ల గ్రాస్ రాబట్టింది. చిన్న సినిమా గా వచ్చిన ఈ సినిమా అనూహ్యాంగా బ్లాక్ బస్టర్ అయింది. అయితే మళ్ళీ ఇప్పటివరకు విజయ్ ఈ రేంజ్ హిట్ కొట్టలేదు. ఇక టాలీవుడ్ (Tollywood) లో ఆ తర్వాత నేచుర‌ల్ స్టార్ నాని `ద‌స‌రా` సినిమాతో వంద కోట్ల క్ల‌బ్ లోకి అడుగు పెట్టాడు. అప్ప‌టివ‌ర‌కూ ఎన్నో సినిమాలు చేసాడు కానీ ఏ సినిమాతో సాధ్యంకాని వ‌సూళ్లు `ద‌స‌రా`తోనే కొట్టి చూపించాడు. ఇక మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ `ఎఫ్ -2` సినిమాతో వంద కోట్లు సాధించాడు. అయితే ఈ క్రెడిట్ లో సగం విక్ట‌రీ వెంక‌టేష్ సొంతం. అలాగే సీనియ‌ర్ హీరో అయిన ర‌వితేజ కి కూడా సెంచ‌రీ కొట్ట‌డానికి ద‌శాబ్ధాలు స‌మ‌యం ప‌ట్టింది. `ధ‌మాకా` సినిమాతో 100 కోట్ల క్ల‌బ్ లో చేరాడు. ఇక యంగ్ హీరో నిఖిల్ `కార్తికేయ‌-2`తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అవ్వ‌డ‌మే కాకుండా వంద కోట్లు సాధించిన స్టార్ గా రికార్డు సాధించాడు. అయితే ఈ వసూళ్లు హిందీ వెర్షన్ కలుపుకుని ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా సిద్ధూ జొన్నలగడ్డ కూడా టిల్లు స్క్వేర్ తో వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.

యంగ్ హీరోలు కూడా..

అయితే ఈ క్లబ్ లో మీడియం రేంజ్ హీరోలే కాకుండా చిన్న హీరోలైన యంగ్ హీరోలు ఏమాత్రం ఊహించని విధంగా వంద కోట్ల క్లబ్ లో చేరారు. అలాగే మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఏకంగా తొలి సినిమాతోనే సెంచ‌రీ కొట్టాడు. అదే `ఉప్పెన‌`. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ప్ర‌తిభ‌తోనే అది సాధ్య‌మైంది. అయితే ఈ సినిమా తర్వాత ఇతగాడికి మరో హిట్ ఇంకా దక్కలేదు. ఇక ఈ సంక్రాంతి కి తేజ సజ్జ `హ‌నుమాన్` సినిమాతో పాన్ ఇండియాలో ఎంత ఫేమ‌స్ అయ్యాడో తెలిసిందే. ఆ సినిమా 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. హీరోగా న‌టించిన మూడ‌వ సినిమాతోనే ఆ రికార్డు సాధించాడు. ఇక వీళ్ళే కాకుండా మీడియం రేంజ్ హీరోల్లో సెంచరీ కొట్టే కెపాసిటీ ఉన్న హీరోల్లో నాగ చైతన్య, రామ్ పోతినేని, గోపీచంద్, శర్వానంద్ లాంటి హీరోలు సరైన సినిమాలతో వస్తే వంద కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద పనేమీ కాదు. ఇక ఈ ఇయర్ రాబోయే క్రేజీ సినిమాల్లో సరిపోదా శనివారం, తండేల్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలకు వంద కోట్ల వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు