Mr Bachchan: రీల్ వార్, రియల్ వార్

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మాస్ కమర్షియల్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. షాక్ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన హరీష్, మిరపకాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హరీష్ ఎన్ని సినిమాలు చేసినా కూడా రవితేజతో సినిమా చేయడం అనేది ప్రత్యేకమైన చెప్పాలి. రవితేజ కి హరీష్ ఇచ్చే రెస్పెక్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. హరీష్ కి రవితేజ సినిమా జీవితాన్ని అందించడంతో చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

ఇకపోతే హరీష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైలాగ్స్ ను అద్భుతంగా రాస్తాడు. పంచ్ లైన్లు, వన్ లైన్ డైలాగ్స్ రాయడంలో హరీష్ తోపు అని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు హరీష్.
ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తుంది.
ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా నుంచి రీసెంట్ గా జగపతిబాబు ఫస్ట్ లుక్ ను రీవీల్ చేసింది చిత్ర యూనిట్.

ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన నటులలో జగపతిబాబు ఒకరు. ఒకప్పుడు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశారు జగపతిబాబు. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కి జగపతిబాబు అంటే ఒక అభిమాన హీరో అని చెప్పొచ్చు. జగపతిబాబు సినిమాలో కూడా ఆడియన్స్ ఒకప్పుడు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అయితే ఒక టైం వచ్చేసరికి జగపతిబాబు సినిమాలు సరిగ్గా ఆడలేదు. ఆల్మోస్ట్ కెరియర్ కూడా క్లోజ్ అయిపోయింది అంటూ చాలామంది అనుకున్నారు. ఆ తరుణంలో హీరోగా చేసిన జగపతిబాబు కాస్త విలన్ గా మారాడు.

- Advertisement -

మామూలుగా కొంతమంది విలన్ గా చేసి హీరోలుగా మారిన నటులు చాలామంది ఉన్నారు. నేడు సూపర్ స్టార్ గా ఆదరించే రజినీకాంత్ ఒకప్పుడు విలన్ గానే చేశారు. అలానే తెలుగు ప్రేక్షకులు అన్నయ్యనే పిలుచుకుని మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకప్పుడు విలన్ గా కెరియర్ స్టార్ట్ చేసి హీరోగా నిలబడ్డారు. అలానే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఒకప్పుడు విలన్ గానే చేశారు. ఇక ఈ తరానికి వస్తే జయం నిజం వర్షం వంటి సినిమాల్లో విలన్ గా కనిపించాడు గోపీచంద్ ఆ తర్వాత హీరోగా ప్రూవ్ చేసుకొని ప్రస్తుతానికి హీరోగాని కొనసాగుతున్నాడు.

ఇకపోతే వీరందరికంటే జగపతిబాబు ప్రత్యేకం అని చెప్పొచ్చు. ముందుగా హీరోగా నిలబడి చాలామంది అభిమానులను సాధించుకుని ప్రస్తుతం విలన్ గా కొనసాగుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో మొదటిసారి విలన్ పాత్రలో కనిపించాడు జగపతిబాబు. ఆ సినిమా తర్వాత జగపతిబాబు కెరియర్ వేరే రేంజ్ కి వెళ్లిపోయిందని చెప్పవచ్చు. విలన్ గా కూడా తనను ప్రూవ్ చేసుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కేవలం తెలుగులోనే మాత్రమే కాకుండా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో తను గుర్తింపు సాధించుకున్నారు.

ఇకపోతే హరీష్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలు చేస్తున్నాడు జగపతిబాబు. జగపతిబాబు ఫస్ట్ లుక్ ను పోస్ట్ చేస్తూ “మిస్టర్ బచ్చన్ సినిమాలో మాస్ మహారాజును వేసేయడానికి సిద్ధం” అంటూ రాసుకొచ్చారు. అయితే దీనికి మాస్ మహారాజ రవితేజ స్పందిస్తూ “ఎవడు ఎవడు వేసేస్తాడో చూసుకుందాం” అంటూ రీట్వీట్ చేశాడు.
అయితే సినిమాలో హీరో విలన్లు డైలాగులు విసురుకోవడం కామన్ ఇదే డైలాగులను రియల్ లైఫ్ లో ట్విట్టర్ వేదిక ఫన్నీ వేలో విసురుకున్నారు వీరిద్దరూ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు