Prabhas Hanu Raghavapudi Movie Update: అప్పుడే పని మొదలుపెట్టేసారు

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. చాలామందికి ఈ సినిమా ఇప్పటికీ ఒక ఫేవరెట్ ఫిలిమ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాని హను రాఘవపూడి తెరకెక్కించిన విధానం చాలామందిని ఆకట్టుకుంది. హను పాత్రలను చూపించిన తీరు, వారితో పలికించిన సంభాషణలు ఇవన్నీ కూడా సినిమాకు మంచి ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ సినిమాకి రదన్ అందించిన మ్యూజిక్ కూడా మంచి హిట్ అయింది. ఇప్పటికీ ఆ సినిమా పాటలు ఒక ఫ్రెష్ ఫీల్ ను క్రియేట్ చేస్తాయి.

ఇకపోతే హను రాఘవపూడి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు హానూ చేసిన సినిమాలలో ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలే ఉన్నాయి. అందాల రాక్షసి తర్వాత చేసిన కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ను చూసింది. ఆ తర్వాత నితిన్ హీరోగా చేసిన లై సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేదు.

అయితే హను తీసిన పడి పడి లేచే మనసు సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఇప్పటికీ చాలామంది అభిమానులు ఉన్నారు. సాయి పల్లవి శర్వానంద్ మధ్య కెమిస్ట్రీ ఆ విజువల్స్ ఆ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన మ్యూజిక్ ఇవన్నీ కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ను క్రియేట్ చేస్తాయి. అయితే హను సినిమాలకు సంబంధించి ఒక కంప్లైంట్ ఉంటుంది సెకండ్ హాఫ్ విషయంలో హను పర్ఫెక్ట్ గా రాయకుండా సినిమాను చుట్టేస్తాడు అని చెబుతూ ఉంటారు. దీనిని హను కూడా ఒప్పుకొని నాకు సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అలానే సీతారామం సినిమాతో దానిని ఓవర్ కం చేశానంటూ చెప్పాడు.

- Advertisement -

ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశంసలతో పాటు అద్భుతమైన కలెక్షన్స్ సాధించుకుంది ఈ సినిమా. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దుల్కర్, మృణల్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకి నేటికీ ఒక కల్ట్ స్టేటస్ ఉంది అని చెప్పొచ్చు. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ని అందించాడు విశాల్ చంద్రశేఖర్. హను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో విశాల్ చంద్రశేఖర్ ఎక్కువశాతం సంగీతం అందించాడు.

ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేయనున్నాడు హను. ప్రభాస్ తో చేయబోయే మూవీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే 3 పాటలను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే హను కి మ్యూజిక్ పట్ల ఉన్న అవగాహన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంచి పాటలు తన సినిమాకు రాబెట్టుకోవాలి హనుకి బాగా తెలుసు.
ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో బిజీగా ఉన్నాడు. అలానే మారుతి దర్శకత్వంలో రాజా షాబ్ అనే సినిమాను చేస్తున్నాడు ప్రభాస్.

ఇకపోతే చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు హను రాఘవపూడి. అలానే రాధే శ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కూడా చంద్రశేఖర్ ఏలేటి దగ్గర శిష్యరికం చేశాడు. ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఏలేటి శిష్యుడు హను ప్రభాస్ కి ఏ స్థాయి హిట్ ఇస్తాడో వేచి చూడాలి. ఈ సినిమా కోసం కూడా ప్రేక్షకులు క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు