All Time Telugu Disaster Movies: అంచనాలను ముంచిన సినిమాలు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు వస్తుంటాయి. అలానే ప్లాప్ సినిమాలు కూడా వస్తుంటాయి. అయితే అంచనాలను మించిన సినిమాలు కొన్ని, అంచనాలను ముంచిన సినిమాలు కొన్ని.
ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. కొన్ని సినిమాలు డిజాస్టర్ అయితే పర్లేదు గాని కొన్ని కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు డిజాస్టర్ అభిమానులు ఇది అసలు తట్టుకోలేరు. అలాంటి సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని ఉన్నాయని చెప్పవచ్చు.

ఎస్ జె సూర్య, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఖుషి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి ఒక హిట్ సినిమా పడటానికి దాదాపు 10 ఏళ్ళు పట్టింది. అయితే ఈ కాంబినేషన్లోనే కొమరం పులి అని ఒక సినిమా వచ్చింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు అంటే చాలామంది ఎక్కువ అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమా చూడడానికి బాగానే ఉన్నా కూడా అంచనాలను అందుకోలేకపోవటం వలన ఈ సినిమా డిజాస్టర్ కానీ మిగిలింది.

కంత్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ చేయడం ఈ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా డిజాస్టర్ అయినా కూడా మరో అవకాశాన్ని మెహర్ కు అందించాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా పైన ఎన్నో అంచనాలను పెంచే విధంగా మెహర్ చెప్పుకొచ్చాడు. మునుపెన్నడు చూడని విధంగా ఎన్టీఆర్ ని సినిమాలో చూడబోతారు అంటూ మంచి అంచనాలను పెంచాడు మెహర్. అని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని నిరాశను ఎదుర్కొంది.

- Advertisement -

చిన్ని కృష్ణ కథను అందించిన ఇంద్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఇప్పటికీ దానికంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అదే స్థాయిలో ఉంటుంది అనుకొని చిన్నికృష్ణ కథ అందించిన సినిమా బద్రీనాథ్. వివి వినాయక దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

చిరుత సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ మగధీర సినిమాతో మంచి స్టార్ డం సాధించుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయితే బాలీవుడ్ ఎంట్రీ గా చేసిన తుఫాన్ సినిమా ఊహించని డిజాస్టర్ ను సొంతం చేసుకుంది.

కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే తన కెరియర్ లో తీసిన తక్కువ సినిమాలైనా కూడా మంచి సినిమాలు తీశాడంటూ కొంత పేర్లు సాధించుకున్నాడు శ్రీకాంత్. తన రెండవ సినిమానే మహేష్ బాబు వెంకటేష్ తో కలిసి చేసి మల్టీస్టారర్ సినిమాలకు తెర తీశాడు. ఆ సినిమా తర్వాత చేసిన ముకుంద సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది. మళ్లీ మహేష్ బాబు తో బ్రహ్మోత్సవం అనే సినిమాను తెరకెక్కించాడు శ్రీకాంత్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. శ్రీకాంత్ అడ్డాలకు అవకాశాలు కొన్ని సంవత్సరాలు పాటు లేకుండా చేసింది.

ఇక వరుసగా హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు కొరటాల శివ. చాలామందికి దక్కని అవకాశం కొరటాల శివకు దక్కింది. అదే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయటం. కానీ ఆచార్య సినిమా ఊహించిన నిరాశకు గురిచేసింది. ఈ సినిమాతో కొరటాల శివ చాలా లోపలికి వెళ్ళిపోయాడు అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు