Siddu jonnalagadda: ఆ సంస్థకు కోట్లు తెచ్చి పెడుతున్న యంగ్ హీరో..!

Siddu Jonnalagadda.. సిద్దు జొన్నలగడ్డ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు ఇది.. మొదట్లో అడపాదడపా సినిమాలు చేసి ప్రేక్షకులలో పర్వాలేదు అనిపించుకున్న ఈయన 2022లో డీజే టిల్లు సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయి.. తన నటనతో అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.. ముఖ్యంగా ఈ సినిమాలో సిద్దు నటనకు అందరూ ఫిదా అయ్యారనే చెప్పాలి .. పైగా బాడీ లాంగ్వేజ్ తో అందరినీ మరింత మెస్మరైజ్ చేశారు. ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది అనడంలో సందేహం లేదు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా సీక్వెల్ గా తాజాగా టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో ఒక సినిమాని తీసుకొచ్చారు . సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా తొమ్మిది రోజుల్లోనే రూ .100 కోట్ల క్లబ్లో చేరిపోయి నిర్మాతలకు భారీ విజయాన్ని చేకూర్చింది..

టిల్లు స్క్వేర్ తో లాభాల బాట..
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను సూర్యదేవరనాగ వంశీ నడిపిస్తున్నారు. ఒకప్పుడు ఎంతో పెద్ద పెద్ద సినిమాలకు పనిచేసిన ఈ బ్యానర్ కి ఒక్క సరైన విజయం కూడా అందలేదు.. ఈ మధ్యకాలంలో లాభాల కోసం తెగ ఆరాటపడుతున్నారు.. ఈ నేపథ్యంలోనే తమ బ్యానర్ లో వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా ఏకంగా రూ.100 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి టిల్లు గాడు బాగా కలిసి వచ్చినట్టు అర్థమవుతుంది.. టిల్లు స్క్వేర్ సినిమా కూడా యువతను బాగా ఆకట్టుకోవడంతో కలెక్షన్లు బాగా వస్తున్నట్లు తెలుస్తోంది.. పైగా ఉగాది, రంజాన్ కూడా వెంట వెంటనే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ సెలవులు కావడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్.. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తే త్వరలోనే రూ .200 కోట్ల క్లబ్లో కూడా చేరిపోతుందనే అంచనాలు వినబడుతున్నాయి.

ఈ బ్యానర్లకు కేరాఫ్ అడ్రస్ గా సిద్దు..
మరోవైపు ఈ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ.. తన బాబాయ్ రాధాకృష్ణ నిర్వహిస్తున్న హారిక హాసిని బ్యానర్ ను కలిపి సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సంస్థలకి గంత కొంతకాలంగా ఏ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. దాంతో సక్సెస్ రేట్ కూడా పడిపోవడంతో సక్సెస్ కోసం బాగా ఎదురుచూసిన ఈ సంస్థలకు ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ తెరకెక్కించిన టిల్లు స్క్వేర్ సినిమా భారీ విజయాన్ని అందించింది.. ఈ సంస్థలు నిర్మించిన సినిమాల విషయానికి వస్తే హారిక హాసిని బ్యానర్లో అలా వైకుంఠపురంలో సినిమా భారీ విజయాన్ని అందుకుంటే మహేష్ బాబుతో తీసిన గుంటూరు కారం సినిమా మాత్రం డిజాస్టర్ మూటగట్టుకుంది. ఈ సినిమాను కొన్న బయ్యర్లు కూడా పూర్తిస్థాయిలో నష్టపోయారు.. సితార బ్యానర్ విషయానికి వస్తే.. ఈ సంస్థ ప్రొడ్యూస్ చేసిన అతి పెద్ద చిత్రం భీమ్లా నాయక్ .. కొంతమేర నష్టాలను కూడా మిగిల్చింది… ఆ తర్వాత వచ్చిన స్వాతిముత్యం, ఆదికేశవ , బుట్ట బొమ్మ , హిందీలో జెర్సీ సినిమాలు కూడా ఫెయిల్యూర్ గానే నిలిచాయి.. అయితే సార్ , మ్యాడ్ చిత్రాలు కొంతమేర లాభాలు తెచ్చాయి కానీ ఈ రేంజ్ లో లాభాలైతే రాలేదని చెప్పాలి ..మొత్తానికైతే టిల్లు సినిమా నిర్మాతలకు భారీ లాభాన్ని అందించిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు