OTT: ఓటీటీ లో దూసుకుపోతున్న మరో థ్రిల్లర్ మూవీ.. డోంట్ మిస్ ఇట్..!

OTT.. ఈ మధ్యకాలంలో ఓటీటీ ల హవా ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో చాలావరకు ఓటీటీ లోనే సినిమాలు విడుదలవుతున్నాయి.. ఒకవేళ థియేటర్లలో విడుదలైనా థియేటర్లలో సినిమా పరిస్థితి చూసి ఆ తర్వాత ఓటీటీ లలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇకపోతే మరోవైపు ఒక్కోసారి థియేటర్లలో హిట్ కానీ సినిమాలు ఓటీటీ లలో అదరగొడుతూ ఉంటాయి..ప్రమోషన్లు లేకనో లేక థియేటర్ లు లేకనో తెలియదు కానీ పెద్దగా ఆదరణకు నోచుకోని చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంటూ ఉంటాయి.. ముఖ్యంగా క్రైమ్ , సస్పెన్స్, హార్రర్ , థ్రిల్లర్ సినిమాలకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది.ఈకోవకు చెందినదే ఇప్పుడు సునీల్ కీలకపాత్రలో నటించిన కథ వెనుక కథ..

కథ వెనుక కథ
కృష్ణ చైతన్య తేనెకెక్కించిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో శ్రీజిత గౌష్, విశ్వంత్ దుడ్డుంపూడి, బెనర్జీ, జయప్రకాష్, శుభశ్రీ , ఆలీ , రఘు బాబు , సత్యం, రాజేష్ , మధునందన్ , భూపాల్ , రూప , ఖయ్యుమ్ , చత్రపతి శేఖర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.. గత ఏడాది మే 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. సరైన ప్రమోషన్స్ లేక పెద్దగా వసూళ్ళు రాబట్టలేదు కానీ ఇప్పుడు ఓటీటీ లో మాత్రం దుమ్ము దులిపేస్తోంది . “ఈటీవీ విన్” లో మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అంటూ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.ముఖ్యంగా ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , ట్విస్ట్ లు చాలా బాగున్నాయనే కామెంట్లు చేస్తున్నారు.. అంతేకాదు ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతున్న ఈ సినిమాకి ఐఎండిబి సంస్థ 7.3 రేటింగ్ ఇవ్వడం విశేషం..

కథ వెనుక కథ సినిమా కథ..
కథ విషయానికి వస్తే.. సినిమా డైరెక్టర్ కావాలని హీరో విశ్వంత్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. హీరో తన మరదల్ని పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా హిట్టు కొట్టాలని శరతు పెడతాడు మేనమామ.. ఆ దిశగా ప్రయత్నాలు చేసి ఒక సినిమా అవకాశం తెచ్చుకుంటే.. ఆ తర్వాత సిటీలో ఒక గ్యాంగ్ కొంతమంది అమ్మాయిలను హత్య చేస్తూ ఉంటారు.. ఆ గ్యాంగును పట్టుకోవడం కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ నియమిస్తారు అధికారులు.. అదే సమయంలో హీరో సినిమాకి సమస్య వస్తుంది. వీటన్నింటినీ హీరో ఎలా అధిగమించాడు అనేది సినిమా కథ.. మొత్తానికి అయితే ఈ సినిమా చాలా ఎక్సైటింగ్ గా సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. సునీల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ సినిమా అటు సునీల్ కి కూడా మంచి పేరు తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం అన్ని జానర్లలో సినిమాల విడుదలవుతున్న నేపథ్యంలో ఇలా సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ, హారర్ జానర్ల చిత్రాలకు అభిమానులు పెద్దపీట వేస్తున్నారు..ఈ నేపథ్యంలో సాగిన కథే ఈ కథ వెనుక కథ.. మరి థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ లలో దూసుకుపోతూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు