HBD AlluArjun : టాలీవుడ్ చరిత్రలో గ్రాండ్ డెబ్యూ ప్రమోషన్ అందుకున్న ఏకైక హీరో..!

HBD AlluArjun : టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రత్యేకతే వేరు. ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోలున్నా స్టైల్ కి కేరాఫ్ గా మరీనా హీరో అల్లు అర్జునే. ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసిన సినిమాన్నిటిలోనూ తన వరకు ఏదో ఒక ప్రత్యేకత చూపించుకుంటూనే ఉన్నాడు. ప్రతి సినిమాలోనూ ఒక డిఫరెంట్ స్టైల్ తో, ఒక డిఫెరెంట్ డ్యాన్స్ స్టెప్స్ తో, అన్నిటికి మించి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో యూత్ ఐకాన్ గా నిలుస్తాడు. అందుకే యూత్ లో బన్నీ కి ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఇంస్టాగ్రామ్ లో సౌత్ ఇండియాలోనే అత్యధిక ఫాలోవర్ల ని కలిగి ఉన్న హీరోగా బన్నీ రికార్డు సృష్టించాడంటే అభిమానుల్లో అల్లు అర్జున్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక నాటి గంగోత్రి సినిమా నుండి నేటి పుష్ప వరకు అల్లు అర్జున్ తనని తాను మలుచుకున్న విధానం చూస్తే, ఈ తరం హీరోలకు అల్లు అర్జున్ డెడికేషన్ ఎంతో ఇన్స్పైర్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక తెలుగు సినిమాలోనే జాతీయ అవార్డు అందుకున్న ఫస్ట్ హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించగా, హీరోగా కావడానికి అల్లు అర్జున్ కెరీర్ బిగినింగ్ లో కష్టాలు పడ్డాడని ఈ జెనరేషన్ ఆడియన్స్ కొందరు అనుకుంటారు. కానీ టాలీవుడ్ టాప్ హీరోస్ లో, ఇంకా లెక్కేస్తే తెలుగు సినిమా చరిత్రలో అందరికంటే గ్రాండ్ గా అల్లు అర్జున్ లాంచ్ అయ్యాడని తెలుసా? తన తొలి సినిమా గంగోత్రి గురించి ఒక్కసారి లుక్కేద్దాం..

ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ తో మెగా మేనల్లుడి ప్రవేశం..

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ లాంచ్ కావడానికి కాస్త కష్టాలు పడ్డాడని కొందరు అనుకున్నారు. కానీ తెలుగు సినిమా చరిత్రలో ఏ హీరోకి సాధ్యపడని గ్రాండ్ లాంచింగ్, గ్రాండ్ మూవీ ప్రమోషన్స్, చివరకి ఆ సినిమా విజయోత్సవ సభని కూడా అప్పటి టాలీవుడ్ టాప్ స్టార్లతో చేయడం జరిగింది. ఆ సినిమా యే గంగోత్రి. అప్పటి టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ అయిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ల్యాండ్ మార్క్ మూవీ అయిన 100 వ చిత్రంగా గంగోత్రి తెరకెక్కింది. స్టార్ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్ లో (అల్లు అరవింద్ సహ నిర్మాత) ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించడం జరిగింది. ఇక ఈ సినిమాకు అప్పటి తెలుగు చిత్ర పరిశ్రమ స్టార్ హీరోలందరూ హాజరయి ప్రమోట్ చేయడం సంచలనం సృష్టించింది.

అక్కినేని నాగేశ్వరరావు నుండి మెగాస్టార్ చిరంజీవి దాకా..

అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ఆడియో లాంచ్ ప్రమోషన్స్ లెజెండరీ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని తెలుగు సినిమా స్టార్స్ ఎందరో హాజరయ్యారు. వాళ్ళందరి లిస్ట్ తీస్తే.. ఏఎన్నార్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, మోహన్ బాబు, శ్రీకాంత్, నందమూరి హరికృష్ణ, మంచు విష్ణు, మురళి మోహన్, అలాగే లెజెండరీ హాస్య నటులు అల్లు రామలింగయ్య కూడా హాజరవడం జరిగింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా, ఓపెనింగ్స్ మాత్రం తెచ్చుకోలేదు. కానీ లాంగ్ రన్ లో మాత్రం బాగా ఆడి ఏకంగా 100 రోజులను పూర్తి చేసుకుంది. ఇక అప్పట్లోనే 54 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ సినిమాకు వంద రోజుల వేడుక కూడా అదే రేంజ్ లో చేసారు. మెగాస్టార్ చిరంజీవి తో పాటు, వెంకటేష్, నాగార్జున, శ్రీకాంత్, అలాగే దర్శకరత్న దాసరి నారాయణరావు తో పాటు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. ఎంత గ్రాండ్ లాంచ్ మళ్ళీ చాలా ఏళ్లకు అక్కినేని నాగచైతన్యకి లభించిందని అంటారు ఇండస్ట్రీ వర్గాలు.

- Advertisement -

అయితే అల్లు అర్జున్(HBD AlluArjun) పుష్ప లాంటి సినిమాల గురించి తన ఫ్యాన్స్ ఎంత ఎక్కువగా మాట్లాడతారో, గంగోత్రి గురించి అంత తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే ఈ సినిమా ఎంత బాగున్నా, అల్లు అర్జున్ తొలి సినిమా లో లుక్స్ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. చాలా చిన్న వయసులోనే లాంచ్ కావడం వల్ల మోహంలో పసి ఛాయలు ఉండడంవల్ల ట్రోల్ అయ్యాడు. కానీ అలా ట్రోల్ చేసిన వాళ్ళ నుండే హీరో అంటే బన్నీయే రా అనే రేంజ్ కి ఇప్పుడు ఎదిగాడు. తన రెండో సినిమాతోనే విమర్శకులకు ఒక గట్టి కౌంటర్ వేయగా, ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డు టాలీవుడ్ కి తెచ్చిఇండస్ట్రీకి గర్వకారణం అయ్యాడు. ఇక నేడు(ఏప్రిల్ 08) అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఐకాన్ స్టార్ కి filmify టీమ్ తరపున బర్త్ డే విషెస్ అందచేస్తున్నాము. ఇక ఈరోజు పుష్ప టీజర్ తో ఇండియా వైడ్ గా రచ్చ చేయబోతున్నాడు అల్లు అర్జున్.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు