The Gray Man : పాపం ధనుష్

కోలీవుడ్ హీరోల్లో ఇంటర్నెషనల్ స్థాయిలో గుర్తింపు ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో ధనుష్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ధనుష్ ఇండస్ట్రీకి వచ్చాడు. చిన్న సినిమాలు చేస్తూ వచ్చాడు. చివరికి కోలీవుడ్ లో అగ్ర హీరోగా చేరిపోయాడు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజిని కాంత్ కే అల్లుడు అయిపోయాడు. ప్రస్తుతం ఐశ్వర్య రజిని కాంత్ కు విడాకులు ఇచ్చాడు అనుకొండి. కానీ, ఆ స్థాయి వరకు ఎదగడం మాటలు కాదు.

కొద్ది రోజుల్లోనే అటు బాలీవుడ్, ఇటు సౌత్ లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. ధనుష్ సినిమా వస్తుందంటే, ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి పెరిగేలా చేశాడు. ఇండియా లో ఇమేజ్ తెచ్చుకున్న ఈ స్టార్ హీరో, హాలీవుడ్ కు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే “ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్” అనే సినిమాతో హాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ సినిమాకు ఎన్నో అడ్డంకులు రావడంతో ఆలస్యంగా రిలీజ్ అయింది. అలాగే నిరాశ పర్చింది.

అయినా, హాలీవుడ్ ఎంట్రీ ప్రయత్నాలను ధనుష్ మానుకోలేడు. తాజా గా “ది గ్రే మ్యాన్” అనే సినిమాతో మరోసారి అంతర్జాతీయ తెరపై తన లక్ ను పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. “ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్” “ఎవెంజర్స్ ఎండ్‌గేమ్” “కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్” “కెప్టెన్ అమెరికా సివిల్ వార్ ” లాంటి భారీ సినిమాలను తెరకెక్కించిన రుసో బ్రదర్స్ ఈ సినిమాకు దర్వకత్వం వహించారు. ఈ సినిమా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో జులై 22 నుండి స్ట్రిమింగ్ కాబోతుంది.

- Advertisement -

కానీ, ముందే అమెరికాలో మీడియాకు, కొంత మంది ప్రముఖులకు స్పెషల్ ప్రిమియర్స్ వేశారు. దీనికి ధనుష్ తన ఇద్దరి పిల్లలతో వెళ్లాడు. ఇదిలా ఉండగా, ప్రిమియర్స్ తర్వాత, రివ్యూలు అన్నీ నెగిటివ్ గానే వచ్చాయి. అలాగే ధనుష్ పాత్ర కూడా పెద్దగా ఉండదని టాక్. ట్రైలర్ లో కొన్ని సెకండ్లు మాత్రమే కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పడు సినిమాలో కూడా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయే పాత్ర అని వినిపిస్తోంది.

దీంతో హాలీవుడ్ కు వెళ్లాలనే ధనుష్ నిరాశ తప్పేలా లేదు. అలాగే ది గ్రే మ్యాన్ సినిమా కోసం ధనుష్ చాలా కష్టపడ్డాడు. ఈ కష్టానికి కూడా ఫలితం దక్కేలా లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు