Agent: టీజర్ అవుట్

భారీ అంచనాలు మధ్య అఖిల్ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చినా అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాతో ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. అందం తో పాటు అవసరమైనంత టాలెంట్ ఉన్నా, అదృష్టం వరించి హిట్ సాధించడానికి అఖిల్ కి దాదాపు ఆరేళ్ళు పట్టింది. తన సొంత పేరునే మొదటి సినిమా పేరుగా పెట్టుకున్న అఖిల్ ఒక నటుడిగా ప్రూవ్ చేసుకుని, అద్భుతమైన డాన్స్ లు చేసినా కూడా మొదట్లో బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపించలేకపోయాడు.

ఎట్టకేలకు బ్యాచలర్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన అఖిల్ ప్రస్తుతం
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ మాత్రమే రిలీజ్ చేస్తూ వచ్చిన చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే ఒక పాన్ ఇండియా సినిమాకి కావాల్సిన అన్ని హంగులను ఈ సినిమాలో నింపినట్లు అర్ధమవుతుంది.
ఏజెంట్ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు అఖిల్ లో చూడని ఒక సరికొత్త కోణాన్ని సురేందర్ రెడ్డి ఆవిష్కరించాడు.హిప్-హాప్ తమిజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉంది. డిఓపి రసూల్ ఎల్లోర్ విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్ గా టీజర్ భారీ అంచనాలను అందుకుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం విజయవంతమైన చిత్రంగా నిలిచే అన్ని అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురేందర్ 2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు