Rules Ranjann : టాప్ గేర్ లో యంగ్ హీరో

ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తుంటారు. ఎంతో మంది కనుమరుగై పోతుంటారు. కానీ, కొంత మంది మంచి హిట్ వచ్చి, హీరోగా గుర్తింపు వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. అలాంటి హీరోనే కిరణ్ అబ్బవరం. రాజావారు రాణిగారు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. దీని తర్వాత యస్.ఆర్.కళ్యాణ్ మండపం’ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇటీవలే “సమ్మతమే” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత ఏం మాత్రం గ్యాప్ తీసుకోకుండా, వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నేను మీకు బాగా కావాల్సినవాడిని, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు చేస్తున్నాడు. తాజా గా శుక్రవారం మరో రెండు సినిమాలను ప్రకటించాడు.

శుక్రవారం కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు కావడంతో, కిరణ్ హీరోగా నటిస్తున్న సినిమాల వివరాలను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే మీటర్ అనే సినిమా నుండి ప్రకటన రాగా, తాజా గా రూల్స్ రంజన్ అని మరో సినిమా ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.

- Advertisement -

ఈ ఫస్ట్ లుక్ లో కిరణ్ అబ్బవరం బిజినెస్ మ్యాన్ సూట్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల కంటే, ఈ సినిమా కాస్త భిన్నంగా ఉన్నట్టు తెలుస్తుంది. క్లాస్ అభిమానులను ఆకట్టుకుంటుంది. కాగా, ఈ సినిమాకి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. కిరణ్ అబ్బవరం సరసన నేహా శెట్టి నటిస్తుంది. ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతుంది. అమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు