Bimbisara: కళ్యాణ్ రామ్ డెవిల్ నుంచి క్రేజీ న్యూస్

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా విలక్షమైన కథలు, విలక్షణమైన పాత్రలలో నటిస్తూ, ఎప్పుటికప్పుడు ప్రేక్షకులను తనదైన నటనతో ఎంటర్టైన్ చేసే నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో కొత్త ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు.

గతేడాది వచ్చిన బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్, ఆ సినిమా సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ ఇటీవలనే అమిగోస్ అనే మరో వైవిధ్య భరితమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమాకు గాను కళ్యాణ్ రామ్ నటన పరంగా మంచి మార్కులే పడిన కథ, కథనంలో లోపాలుండటంతో సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. అయిన సరే తన పంథాను మార్చుకొని కళ్యాణ్ రామ్ మరో కొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులు ముందుకి రానున్నాడు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా భారతీయ స్వాతంత్ర నేపథ్యంలో సాగే కథగా ఉండబోతుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో జులై 5 న ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సౌందర్య రాజన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు