Deepika Padukone: దీపిక టాలీవుడ్ ఎంట్రీ అలా మిస్ అయిందా..?

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పుడు ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ..ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడి అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. వాస్తవానికి దీపిక కొన్నాళ్ల క్రితమే తెలుగువారిని అలరించాల్సి ఉంది.. కానీ వీలుపడలేదు. మరి ఆమె ఏ సినిమా ద్వారా అడుగు పెట్టాల్సింది.. ?ఎందుకు మిస్ అయింది.. అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

దీపిక టాలీవుడ్ ఎంట్రీ మిస్..
ప్రేమించుకుందాం రా , బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబిబిఎస్, టక్కరి దొంగ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ.. రణదీప్- మృదుల జంటగా “లవ్ 4 ఎవర్ “అనే చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ప్రత్యేక పాటలో దీపిక నటించారు.. అయితే కారణం తెలియదు కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.. ఇక అలా తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పే అవకాశాన్ని మిస్సయింది ఈ ముద్దుగుమ్మ.. ఇక అప్పుడు మిస్ అయిన ఆ అవకాశాన్ని ఇప్పుడు ఒడిసి పట్టుకుంది.. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మే తొమ్మిదవ తేదీన పలకరించడానికి సిద్ధమయ్యింది.

కల్కి 2898 ఏడి:
సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఇందులో ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పఠాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహాభారతంతో మొదలయి క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించి.. సినీ ప్రియులలో అంచనాలను రెట్టింపు చేశారు దర్శకులు..

- Advertisement -

దీపిక కెరియర్..
ఐశ్వర్య అనే కన్నడ చిత్రంతో కెరియర్ మొదలుపెట్టిన దీపికా పదుకొనే.. ఆ తర్వాత ఓం శాంతి ఓం అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది.. ఆ తర్వాత కాక్ టైల్ , రేస్ -2, చెన్నై ఎక్స్ప్రెస్ , పఠాన్, బాజీరావు మస్తానీ వంటి చిత్రాలలో వైవిద్య పాత్రలు పోషించి మెప్పించిన ఈమె బాంబే టాకీస్, ధమ్ మారో ధమ్, సర్కస్ వంటి సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా అలరించింది. ప్రస్తుతం సింగం ఫ్రాంచైజీ తో తెరకెక్కుతున్న మూడవ సినిమా సింగం ఎగైన్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు..

దీపికా వ్యక్తిగత జీవితం..
దీపికా పదుకొనే గత కొద్ది రోజుల క్రితం అభిమానులకు శుభవార్త తెలిపిన విషయం తెలిసిందే.. త్వరలోనే తల్లి కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే త్వరలోనే పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పి అందరిని సంతోషపరిచింది ఈ ముద్దుగుమ్మ.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు