Deepika Padukone: దీపిక డిమాండ్స్ కి షాక్ అవుతున్న నిర్మాతలు..!!

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతూ సత్తా చూపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమాల ప్రభంజనం పాన్ ఇండియా లెవెల్ లో ఎలా ఉందో అందరికీ తెలుసు.. బాహుబలి తో మొదలైన ఈ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది.. ఈ క్రమంలోనే తెలుగు సినిమా అంటే ఒకప్పుడు చిన్నచూపు చూసిన సెలబ్రిటీలంతా ఇప్పుడు తెలుగు సినిమాలో నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

టాలీవుడ్ కోసం ఎగబడుతున్న స్టార్స్..
ఇప్పటికే బాలీవుడ్ నుంచి స్టార్ హీరోలే కాదు స్టార్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆలియా భట్, జాన్వీ కపూర్ , దిశా పటాని, శ్రద్ధా కపూర్ , దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ తారలంతా తెలుగు సినిమాలలో నటిస్తున్నారు.. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ కే పరిమితమైన దీపికా పదుకొనే ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతోంది..వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో దీపిక హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే ..

రెమ్యునరేషన్ పెంచి నిర్మాతలకు చుక్కలు..
ఇకపోతే దీపిక రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. బాలీవుడ్ లో ఒక్కో సినిమాకి రూ.15 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న ఈమె.. ఇప్పుడు అదే రేంజిలో తెలుగులో కూడా డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. దీంతో హీరోయిన్ కే అన్ని కోట్ల పారితోషకం ఇవ్వలేక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం నేషనల్ వైడ్ గానే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా పాపులారిటీ దక్కించుకుంటున్న దీపిక క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని.. తప్పని పరిస్థితిలో ఈమె అడిగినంత రెమ్యూనరేషన్.. ఇవ్వడానికి నిర్మాతలు వెనుకడుగు వేయడం లేదు..

- Advertisement -

బన్నీ మూవీలో దీపిక..
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సబ్జెక్టులో కూడా ఈమె హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. పుష్ప 2 రిలీజ్ వరకు అల్లు అర్జున్ బిజీ కాబట్టి ఈలోగా కథ పూర్తి చేసుకునే ఆలోచనలో పడ్డారు త్రివిక్రమ్.. అందులో భాగంగానే ఈ సినిమాలో దీపికా పదుకొనే ను హీరోయిన్ తీసుకోవాలని అనుకోగా ఈ వార్తలు బయటకి రాగానే.. అటు అల్లు ఫాన్స్ కూడా మరింత ఎగ్జైట్ అవుతున్నారు.. పుష్ప 2 తర్వాత బన్నీ ఇమేజ్ మరింత పెంచేలా ఈ సినిమాని ప్లాన్ చేస్తూ ఉండడం గమనార్హం.

తగ్గని దీపిక..
ఇకపోతే దీపికా నటిస్తున్న రెండవ తెలుగు సినిమా కాబట్టి కల్కి కోసం తీసుకున్న రేంజ్ లోనే ఈమె ఈ సినిమాకి కూడా పారితోషకం తీసుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి.. కల్పి అంటే 500 కోట్లు బడ్జెట్ తో తిరక్కెక్కుతోంది. ఈ విషయం తెలిసి నెటిజన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే తన రెమ్యూనరేషన్ తో టాలీవుడ్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. వాస్తవానికి తెలుగు హీరోయిన్స్ కి రూ .4 లేదా రూ .5 కోట్లకు మించి పారితోషకాలు ఇవ్వరు.. అలాంటిది బాలీవుడ్లో పేరు దక్కించుకున్న దీపికాకి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం .. ఏది ఏమైనా దీపిక క్రేజ్ ని బట్టి ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నప్పటికీ.. ఆమె డిమాండ్స్ కి నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు