Rachana Banerjee : మద్యానికి బానిసై కెరీర్ ని నాశనం చేసుకున్న హీరోయిన్..?

సినీ గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎలా మారుతారుఅనే విషయాన్ని ఎవరు చెప్పలేరు.. ముఖ్యంగా ఎవరు పైకి ఎదుగుతారు.. ఎప్పుడు కిందికి పడతారు అనే విషయాన్ని కూడా అంచనా వేయలేము. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకొని సెటిలైన సందర్భాలు కూడా ఉన్నాయి.. మరి కొంతమంది కెరియర్ పైన భయంతో పలు రకాల వ్యసనాలకు కూడా బానిసలై జీవితాన్ని కోల్పోతున్నారు.. అలా తన జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్స్ లిస్టులలో రచన బెనర్జీ కూడా ఒకరు..

స్టార్ హీరోలతో రచన..
ప్రస్తుతం ఈ జనరేషన్ కి ఈ హీరోయిన్ అంటే ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒకానొక సమయంలో రచన అంటే ఎంతో మంది కుర్రకారులకు ఆరాధ్య దేవతగా పేరుపొందింది.. ముఖ్యంగా చిరంజీవి , బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కూడా ఈమె నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ , ఒడియ, హిందీ ఇతరత్రా భాషలలో కూడా దాదాపుగా వందకుపైగా సినిమాలలో నటించింది. మొదటిసారి డైరెక్టర్ ఈవీవీ తీసిన నేను ప్రేమిస్తున్నాను అనే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.

చెడు వ్యసనాలే కారణం..
ఆ తర్వాత చిరంజీవితో బావగారు బాగున్నారా, జగపతిబాబుతో మావిడాకులు, శ్రీకాంత్ తో కన్యాదానం వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా తెలుగు పరిశ్రమకు దూరమైపోయిన రచన మళ్లీ తెరపై కనిపించలేదు.. అయితే అలా ఉన్నట్టుండి కనుమరుగు అవ్వడానికి ముఖ్య కారణం ఆమె చెడు వ్యసనాలకు బానిస అవ్వడమే అన్నట్లుగా అప్పట్లో తెగ వార్తలు వినిపించాయి.. ఆకట్టుకునే అందం , అభినయం ఉన్నప్పటికీ ఈ బెంగాలీ ముద్దుగుమ్మ కు అవకాశాలు తక్కువ అవ్వడంతో ధూమపానం , మద్యపానానికి బానిసయ్యిందట. అలా చేతిలో ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకొని చాలామంది దగ్గర అప్పులు చేసిందని వార్తలు వినిపించేవి.

- Advertisement -

రచన వ్యక్తిగత జీవితం..
దీంతో ఈమె పరిస్థితి చాలా దిగజారిపోయిందనుకున్న తల్లిదండ్రులు వెంటనే బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ప్రోబల్ బసు అనే వ్యక్తి కి ఇచ్చి వివాహం చేశారు. వివాహం తర్వాత ఈమెలో ఎన్నో మార్పులు రావడం… చెడు అలవాట్లకు దూరమై.. ఒక మంచి ఇల్లాలుగా పేరుపొందింది.. అయితే రచన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది అనుకున్న సమయంలోనే రాజకీయాలలోకి వస్తున్నట్లు తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..

రాజకీయ ప్రవేశం..
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. అక్కడి సీఎం మమతా బెనర్జీ కూడా ఈమెకు అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హుగ్లీ నియోజవర్గం నుంచి రచన ఎంపీగా పోటీ చేయబోతుందట.. ఈ ప్రాంతం నుంచి ఎలాగైనా తమ హవా కొనసాగించాలని.. ఇలా సినీ గ్లామర్ ని మమతా బెనర్జీ పోటీగా నిలబెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రచన ఇప్పుడు హుగ్లీ నుంచి టీఎంసీ ఎంపీగా పోటీ చేయబోతుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు