Kriti shetty: కృతి శెట్టి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పబోతోందా..?

మొదట సూపర్-30 అనే ఒక హిందీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి.. ఇక తెలుగు తెరకు ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి..తన మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ చిత్రానికి ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించగా.. మెగా మేనల్లుడు ఈ చిత్రంలో హీరోగా నటించారు. కృతి శెట్టికి ఈ సినిమా స్టార్ డమ్ తీసుకువచ్చిందని చెప్పవచ్చు.. ఇక తర్వాత ఏమని నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు చిత్రాలు భారీ విజయాన్ని అందించడంతో.. అలా పెద్ద పెద్ద బ్యానర్ లో కూడా పలు రకాల అవకాశాలలు లభించాయి. అలా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారుతున్న సమయంలో వరుసగా భారీ ఫ్లాప్ లు ఎదురయ్యాయి.

కృతి శెట్టి కెరియర్..
ఒక్కసారిగా దూసుకు వచ్చిన కృతి శెట్టి.. అంతే స్పీడుతో కిందికి జారిపోయింది. దీంతో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్ , మలయాళం ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది..ముఖ్యంగా ఉప్పెన చిత్రం తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాల సక్సెస్ తో రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేసింది.. కానీ రామ్ పోతినేని తో తీసిన ది వారియర్ సినిమా మాత్రం ఘోరమైన డిజాస్టర్ కావడంతో అలా కృతి శెట్టి సక్సెస్ కు బ్రేకులు పడ్డాయి.. ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి చిత్రాలు కూడా నిరాశనే మిగిల్చాయి.

కోలీవుడ్లో ఎంట్రీ..
భారీ అంచనాల మధ్య విడుదలైన కస్టడీ సినిమా కూడా ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది.. దీంతో అవకాశాలు రాకపోవడంతో తమిళం , మలయాళం ఇండస్ట్రీ వైపు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యింది. అలా మొదట కోలీవుడ్ హీరో కార్తీక్ సరసన కార్తీ -26 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి నలన్ కుమార్ స్వామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కృతి శెట్టి ఫస్ట్ స్ట్రైట్ తమిళ సినిమాగా నిలిచింది.

- Advertisement -

మళయాళం లో ఎంట్రీ..
ఇక మరొక సినిమా లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే జీనీ మూవీలో జయం రవి కి జంటగా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఈ సమయంలోనే అజయంతే రాందం మోషణం అనే మలయాళం చిత్రంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.. ఇందులో హీరోగా టివోనో థామస్ నటిస్తున్నారు. ఇలా ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు తమిళం ప్రాజెక్టులతో పాటు ఒక మలయాళం సినిమా కూడా ఉన్నది.. తెలుగులో మాత్రం మనమే అనే సినిమాలో మాత్రమే నటిస్తోంది.. ఇలా ఈమె ఎంచుకున్న సినిమాలను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో తెలుగులో కృతి శెట్టి కనిపించేందుకు అవకాశాలు ఎక్కువగా లేవనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కృతి శెట్టి తెలుగు ఇండస్ట్రీకి దూరం కాబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ తెలుగులో ఈమె నటిస్తున్న చిత్రం కనుక డిజాస్టర్ అయితే కచ్చితంగా దూరం అవ్వక తప్పదు.. మరి చూడాలి అదృష్టం ఎలా తలుపు తడుతుందో..

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు