Lifestyle : ఈ తప్పులు చేస్తే అవతలి వాళ్లకు అడ్వాంటేజ్ ఇచ్చినట్టే

అవతలి వాళ్ళు మీ విషయంలో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని ఎప్పుడైనా అనిపించిందా ? ఒకవేళ సమాధానం ఎస్ అయితే మీరే వాళ్లకు ఆ అవకాశాన్ని ఇచ్చినట్టు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే తప్పుల వల్ల ఈజీగా ఇతరులు అడ్వాంటేజ్ తీసుకోగలుగుతారు. మరి ఆ మిస్టేక్స్ ఏంటి? అంటే….

1. కాన్ఫిడెంట్ లేకపోవడం
నేనిది చేయగలనా లేదా ? అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది జీవితంలో భాగమైతే, అదే మిమ్మల్ని ఇతరులు ఉపయోగించుకునేలా చేస్తుంది. ఎందుకంటే ఆత్మవిశ్వాసం లేనప్పుడు మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటాము. అంటే మన విలువను మనమే తగ్గించుకుంటున్నట్టు. దానివల్ల మాట్లాడడానికి లేదా చొరవ తీసుకోవడానికి వెనకాడవచ్చు. దీంతో ఆ స్పేస్ లో మన కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఇతరులు అడుగు పెడతారు. అయితే కాన్ఫిడెంట్ గా ఉన్న వ్యక్తుల విషయాల్లో ఇతరులు అడ్వాంటేజ్ తీసుకోలేరు. మైండ్ ఫుల్ నెస్ కాన్ఫిడెంట్ ను, శక్తిని పెంచుతుంది. ప్రజెంట్ పై కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనల్ని మనం అంగీకరించడం, అభినందించడం నేర్చుకోవచ్చు.

2. ఇతరుల కోసం బ్రతకడం
చుట్టూ ఉన్నవారిని సంతోష పెట్టాలని కోరుకోవడం తప్పుకాదు. ఇది ఇతరులతో త్వరగా కనెక్ట్ కావడానికి ఒక మంచి మార్గం. కానీ అది అలవాటుగా మారితేనే ప్రాబ్లం. అతిగా ఇతర వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మిమ్మల్ని మీరే తక్కువ చేసుకునే పరిస్థితి వస్తుంది. అదే అవతలి వారు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒక ఈజీ వే అవుతుంది.

- Advertisement -

3. బౌండరీస్ క్రియేట్ చేయకపోవడం
సరైన విధంగా బౌండరీస్ సెట్ చేసుకోకపోతే మీ విషయంలో ఇతర వ్యక్తి అడ్వాంటేజ్ తీసుకోవడానికి మీరే ఛాన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది. అవసరమైన చోట ఎస్ చెప్పడం, కొన్నిసార్లు నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా మీ శక్తికి మించిన పనులను చేయాల్సి వచ్చినప్పుడు మొహమాటం లేకుండా నో చెప్పేయండి. స్పష్టమైన బౌండరీస్ సెట్ చేయడం అంటే మిమ్మల్ని, మీ సమయాన్ని విలువైనదిగా మీరు ఫీల్ అవ్వడం.

4. ఇన్ట్యూషన్ ను ఇగ్నోర్ చేయడం
కొన్నిసార్లు మన ఆత్మ మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే గట్ ఫీలింగ్ లాంటిది. ఏదైనా కరెక్ట్ కాదని, లేదా ఇదే కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలాసార్లు మనం అసలు ఇన్ట్యూషన్ ను పట్టించుకోము. ఈ ఇన్ట్యూషన్ అనేది మనల్ని హెచ్చరించే ఒక శక్తివంతమైన సాధనం లాంటిది. కాబట్టి గట్ ఫీలింగ్ ను నమ్మండి.

5. గతంలో లేదా భవిష్యత్తులో జీవించడం… చాలామంది భవిష్యత్తులో లేదంటే గత ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుంటారు. దాని వల్ల బాధ తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. ప్రజెంట్ లో జీవించలేకపోవడం కూడా అవతల వారికి అడ్వాంటేజ్ ఇచ్చినట్టుగానే అవుతుంది.

6. గొడవ భయం…
గొడవ పడడం అన్నది అందరికీ నచ్చదు. కొంతమంది అసౌకర్యంగా, ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఇలా గొడవకు భయపడడం అనేది కూడా అవతలి వాళ్ళు మీ నుంచి అడ్వాంటేజ్ తీసుకోవడానికి మీరిచ్చే ఒక అవకాశం లాంటిది. కాబట్టి మిమ్మల్ని భయపెట్టే భయాలు, అసౌకర్యాల నుంచి పారిపోకుండా ధీటుగా ఎదుర్కోవడం నేర్చుకోండి.

7. సీకింగ్ అప్రూవల్…
ఇతరుల నుండి నిరంతరం అప్రూవల్ పొందడం లాంటివి చేశారంటే మీ గోతిని మీరే తవ్వుకున్నట్టు. ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకునే వారికి ఇదొక మంచి మార్గం అవుతుంది. ఇలా ప్రతిసారి అవతలి వ్యక్తుల అప్రూవల్ కోసం వెయిట్ చేయడం అంటే ఇతరులను సంతోష పెట్టడానికి మీ సొంత అవసరాలు, విలువలు, సరిహద్దులతో మీరు రాజీ పడుతున్నట్టే.

8. సానుభూతి…
మితిమీరిన సానుభూతి కొన్నిసార్లు అవతలి వ్యక్తి మీ విషయంలో అడ్వాంటేజ్ తీసుకునేలా చేస్తుంది. మైండ్ ఫుల్ నెస్ ను ప్రాక్టీస్ చేస్తే బౌండరీస్ కొనసాగిస్తూనే సానుభూతి, కరుణను చూపించగల నేర్పు అలవాటవుతుంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు