Allu Arjun – Atlee : హీరోయిన్ న్యూస్ ఫేక్… ఊపిరి పీల్చుకుంటున్న బన్నీ ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఇంకా స్టార్ట్ కానే లేదు. కానీ అప్పుడే ఈ మూవీ గురించి వస్తున్న రూమర్స్ ఆయన అభిమానులను తెగ టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో నటించబోయే హీరోయిన్ విషయంలో. అయితే ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి హీరోయిన్ గురించి వచ్చిన వార్తలు ఫేక్ అని తెలియడంతో ఎట్లకేలకు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ వాళ్లను అంతలా భయపెట్టిన ఆ హీరోయిన్ ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే…

అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్ లో ఐరన్ లెగ్ ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. అనుకున్న సమయానికి మూవీని పూర్తి చేయడానికి చిత్ర బృందం తెగ కష్టపడుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ గురించి టాక్ అప్పుడే మొదలైపోయింది. తమిళ దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్ కాంబో త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని ప్రచారం జరుగుతుంది. ఇక అప్పుడే ఈ సినిమాకు అల్లు అర్జున్ 120 కోట్లు, డైరెక్టర్ అట్లీ 60 కోట్లు పారితోషికంగా డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే హీరోయిన్ విషయంలో కూడా ఒక అడుగు ముందుగానే ఉన్నారు రూమర్ రాయుళ్లు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ పూజా హెగ్డే నటించబోతుందని రూమర్లు మొదలయ్యాయి. దీంతో ఒక్కసారిగా బన్నీ ఫాన్స్ గుండె జారినంత పనైంది. సోషల్ మీడియా వేదికగా ఈ ఐరన్ లెగ్ హీరోయిన్ ను సినిమాల్లోకి తీసుకోవద్దంటూ రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. అయితే తాజాగా అవి జస్ట్ రూమర్స్ అని తేలిపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకొని తేలికపడ్డారు.

బన్నీతో ఈసారి ఫ్రెష్ ఫేస్…
ఇదిలా ఉండగా అల్లు అర్జున్, అట్లీ మూవీకి సంబంధించి ఇంకా క్యాస్టింగ్ మొదలవ్వలేదని సమాచారం. నటీనటుల ఎంపిక కూడా జరగకముందే హీరోయిన్ కూడా సెలెక్ట్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెష్ ఫేస్ తో జోడి కట్టబోతున్నాడని తెలుస్తోంది. ఇదివరకు ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్లందరిని పక్కన పెట్టి, కొత్త హీరోయిన్ తో జోడి కట్టబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. మరి ఆ అద్భుతమైన అవకాశం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే అల్లు అర్జున్, అట్లీ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే.

- Advertisement -

పాపం పూజ…
ఇక బుట్ట బొమ్మ పూజ హెగ్డే పరిస్థితి ప్రస్తుతం అధ్వాన్నంగా ఉంది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస ఫ్లాప్స్ అందుకుని ఇప్పుడు కనిపించకుండా పోయింది. కేవలం సోషల్ మీడియాలోనే అప్పుడప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ తాను కూడా ఉన్నానని గుర్తు చేస్తోంది. ఆమె హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, కిసి కా భాయ్ కిసి కా జాన్ వంటి మూడు భాషల్లోని సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు కూడా వచ్చేసింది. దీంతో పూజ జోరుకు బ్రేకులు పడగా, రీసెంట్ గా రెండు క్రేజీ సినిమాల నుంచి తప్పుకోక తప్పలేదు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు