Tollywood Thanks Meets : ఈ మధ్య కొంచెం టైం తీసుకుంటున్నారు

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు సంభవించాయి. ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఆ సినిమా కంటే ముందు చాలా వార్తలు వినిపించేవి. ఆ సినిమాకి సంబంధించిన సమాచారం అంతా న్యూస్ పేపర్ లో చదువుకునే వారు చాలామంది సినీ ప్రేమికులు. ఇకపోతే ఈ మధ్యకాలంలో అంతా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఒక సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలి అన్న కూడా ఒక అప్డేట్ ఇస్తున్నారు ప్రస్తుతం చిత్ర యూనిట్ టీం.

ఒకప్పుడు ఒక సినిమాకు సంబంధించిన పాటలన్నీ కూడా ఒకేసారి సినిమా నెలరోజుల ముందే విడుదల చేసేవారు. ఆ పాటలను వినాలంటే ఆ క్యాసెట్లు కొనుక్కోవడం. ఆ సిడీలు తెచ్చుకోవడం అలా ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్ లో ఇంటర్నెట్ ఎంతగా ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్క పాటని ఒక్కొక్కసారి విడుదల చేస్తూ సినిమా రిలీజ్ టైం కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేయడం కండక్ట్ చేస్తారు చిత్ర యూనిట్.

ఒకప్పుడు ఒక సినిమా హిట్ అయింది అని చెప్పడానికి ఆ సినిమా ఎన్ని సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది అంటూ లెక్కలు చెప్పుకొచ్చేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా హిట్టుని ఆ సినిమాకు వచ్చే డబ్బులు ద్వారా లెక్కిస్తున్నారు. ఇక్కడ అంతా మా సినిమాకి ఇంత కలెక్షన్స్ వచ్చాయి అంత కలెక్షన్స్ వచ్చాయి అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇకపోతే అసలు సినిమా ఒరిజినల్ కలెక్షన్స్ కూడా చాలామందికి తెలియదు.

- Advertisement -

ఇంకో రకంగా చెప్పాలి అంటే రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమా మొదటి షో పడగానే, ఆఫ్టర్నూన్ షో కి బ్లాక్ బస్టర్ హిట్, క్లాసికల్ హిట్, మ్యాజికల్ హిట్, ఆడియన్స్ హిట్ అంటూ రకరకాల పేర్లు పెట్టి ఆ ప్రొడక్షన్స్ పోస్టర్స్ ను ఇమిడియేట్ గా రిలీజ్ చేస్తాయి.
ఇంకొన్ని ప్రొడక్షన్ హౌసెస్ అయితే ఆ ఆఫీస్ ముందు టపాకాయలు పేల్చి సినిమా హిట్ అని అనౌన్స్ చేసుకుంటారు.

ఇంకొన్ని ప్రొడక్షన్స్ హౌసెస్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు మంచి బుకింగ్స్ వస్తున్నాయి. చూసినవాళ్లంతా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఆల్మోస్ట్ సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేసింది అంటూ మాటలు చెప్పడం మొదలుపెడతారు. అక్కడికక్కడే కేక్ కట్ చేసి సెలబ్రేషన్ కూడా మొదలుపెడతారు. కానీ ఒక రెండు వారాల తర్వాత ఆ సినిమా తుది ఫలితం ఏంటో అర్థం అవుతుంది.

ఇకపోతే ప్రస్తుతం కొందరు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు సక్సెస్ సెలబ్రేషన్స్ కి కొద్దిగా టైం తీసుకుంటున్నారు అని చెప్పొచ్చు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టకుండా ఆ సినిమా కలెక్షన్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ, నాలుగైదు రోజుల తర్వాత ఆ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. రీసెంట్ గా మార్చి 8న మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశ్వక్సేన్ నటించిన గామి. మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు. గోపీచంద్ నటించిన భీమా. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. అందుకనే ఈ మూడు చిత్ర యూనిట్లు కూడా కొంచెం టైం తీసుకుని సక్సెస్ మీట్ లు నిర్వహించారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు