Gopichand : భీమా డే 1 లెక్క.. ఇంపాక్ట్ గట్టిగా పడింది?

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా ఎట్టకేకలకు థియేటర్లలో రిలీజ్ కావడం జరిగింది. గత పదేళ్ళగా సరైన హిట్టు లేక సతమతవుతున్న ఈ ఆరడుగుల మాస్ హీరో, ఫైనల్ గా తనకు అచ్చోచ్చిన పోలీస్ డ్రామా తో ఒక డివోషనల్ టచ్ తో మహా శివరాత్రి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మార్చి 8న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమాను కన్నడ స్టార్ దర్శకుడు హర్ష దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సినిమాని చూస్తుంటే చాలా మందికి ఒక బోయపాటి మాస్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది, కానీ కథలో కొత్తదనం లేకపోవడం వల్ల క్లాస్ సెంటర్ల ఆడియన్స్ ని ఈ సినిమా మెప్పించలేక పోయింది. ఫలితంగా ఓవర్సీస్ లో భీమా కు చాలా దెబ్బ పడింది.

తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ స్టార్ట్..

భీమా ఫస్ట్ డే కలెక్షన్లు గమనిస్తే ఒక రకంగా గోపీచంద్ సినిమాల్లో నిరాశ పరిచే ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ, గత చిత్రాల తో పోల్చుకుంటే ఈ సినిమాకి బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పొచ్చు. ఇక ఏరియా వైస్ గా భీమా కలెక్షన్లను గమనిస్తే.. నైజాంలో 0. 76 కోట్లు, సడక్ లో 0.44 కోట్లు, ఆంధ్ర లో 0. 88 కోట్లు వసూలు చేయగా, టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 2.08 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా, ఓవర్సీస్ కూడా కలుపుకుని కేవలం 25 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక భీమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 2.33 కోట్ల షేర్ ని 4.25 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.

- Advertisement -

బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలో..

అయితే భీమా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ పరంగా చాలా తక్కువే తెచ్చుకోగా, ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లను బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు కనుక వచ్చిన కలెక్షన్లను తీసేయగా, మరో 9.76 కోట్ల కలెక్షన్లు రాబడితే సేఫ్ అవుతుంది. టార్గెట్ చిన్నదే అయినా, పోటీగా రిలీజ్ అయిన ప్రేమలు, గామి సినిమాలకు దీనికంటే మంచి టాక్ రావడంతో ఆడియన్స్ కి భీమా మూడో ఆప్షన్ గా మారింది. ఇక భీమా కి మాస్ ఆడియన్స్ సపోర్ట్ మాత్రమే ఎక్కువగా వస్తుంది. అయితే గోపీచంద్ గత చిత్రాల కంటే బెటర్ గానే ఉండడంతో భీమా సి సెంటర్ల ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. అయితే భీమా ఈ వీకెండ్ రెండు రోజుల్లో సాలిడ్ గ్రోత్ చూపిస్తే గాని బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టమని చెప్పాలి. వీకెండ్ లో భీమా సినిమా కనీసం డెబ్బై శాతం రికవరీ చేయాల్సిందేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఎందుకంటే భీమా కి లాంగ్ రన్ లో కలెక్షన్లు రాబట్టే అవకాశం ఈ పోటీ లో లేదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. మరి రెండో రోజు భీమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత వరకు గ్రోత్ చూపిస్తుందో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు