Boney Kapoor : అలా పోల్చొద్దు

అతిలోకసుందరి, దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక శ్రీదేవి నటించిన తెలుగు సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్ కావడం విశేషం. అటువంటి లెజెండరీ యాక్టర్ శ్రీదేవి వారసురాలిగా జాన్వి కపూర్ బీ టౌన్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. జాన్వి కపూర్ ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. 

ముఖ్యంగా తన తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది జాన్వి కపూర్. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “మిలి”. మలయాళం లో సూపర్ హిట్ అయిన ” హెలెన్” కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు మత్తుకుట్టీ జేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేశాయి.ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో జాన్వి కపూర్ ఆమె తండ్రి బోని కపూర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఓ మీడియా వ్యక్తి జాన్వి కపూర్ ను శ్రీదేవితో పోలుస్తూ మాట్లాడుతుండగా బోనీకపూర్ అడ్డుకున్నారు. బోని కపూర్ మాట్లాడుతూ ” జాన్విని శ్రీదేవితో పోల్చొద్దు.. శ్రీదేవిని 150 – 200 సినిమాలలో ప్రేక్షకులు చూశారు. జాన్వి తన ప్రయాణం ఇప్పుడే మొదలుపెట్టింది. దయచేసి వాళ్ళ అమ్మతో ఆమెను పోల్చొద్దు”. అని అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు