Nikhil : ఫుల్ క్లారిటీ

యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తాజాగా వచ్చిన చిత్రం కార్తికేయ2. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ స్థాయిలో విజయం సాధించింది. బాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయి రికార్డు స్థాయిలో కలెక్షన్లు చేసింది. ఈ చిత్రం ఇటీవల ఓటీటీ లోకి వచ్చి కూడా రికార్డులు నమోదు చేస్తోంది. అయితే కార్తికేయ 2 సీక్వెల్ గా పార్ట్ 3 ఉంటుందా ? ఉంటే అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటూ అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రశ్నలు అన్నింటికీ హీరో నిఖిల్ సమాధానం ఇచ్చారు. 

కార్తికేయ చేసినప్పుడు కార్తికేయ 2 ఉంటుందా అని అడేగే వారు. ఇప్పుడు కార్తికేయ2 వచ్చిన తర్వాత పార్ట్ 3 గురించి అడుగుతున్నారు. కార్తికేయ3 చేయకపోతే అభిమానులు ఏం అంటారో తెలియదు కానీ, మా అమ్మ వదలదు. అంటూ హీరో నిఖిల్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే కార్తికేయ 3 ఉంటుందని అభిమానులకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది. 

కాగా కార్తికేయ 2 చివర్లో పార్ట్ 3 ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు. ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండబోతుందని కూడా క్లూ ఇచ్చారు. అలాగే డైరెక్టర్ చందు మొండేటి కూడా ఓ సందర్భంలో పార్ట్3 కి కథ సిద్ధం చేస్తా అని అన్నారు. తాజాగా హీరో నిఖిల్ సమాధానంతో కార్తికేయ-3 ఉంటుందని ఫుల్ క్లారిటీ వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు