Kollywood: బిచ్చగాడు2 ట్రైలర్.. ఈసారి 100 రెట్లు ఎక్కువ

బిచ్చగాడు. అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చిన్న సినిమా గా వచ్చి అఖండ విజయం సాధించింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు విజయ్ ఆంటోని హీరోగా తమిళ దర్శకుడు “శశి” దర్శకత్వంలో 2016 మార్చ్ 4 న ఈ సినిమా విడుదలైంది. ఏ అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో కోటీశ్వరుడైన హీరో తన తల్లి ఆరోగ్యం బాగుపడాలని 48 రోజులు బిచ్చగాడిలా, తానెవరో ప్రపంచానికి తెలియకుండా బతుకుతాడు.

ఎంతో న్యాచురల్ గా ఉండే ఈ సినిమా చాలా తక్కువ ఖర్చుతో తెరకెక్కించారు. విజయ్ ఆంటోని స్వయంగా నటించి నిర్మించిన ఈ సినిమాకు తానే సంగీతం కూడా అందించాడు. అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక తెలుగులో అయితే కేవలం 40 లక్షలకు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కొనగా దాదాపు తెలుగులో 10 కోట్ల రూపాయలు వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కు సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమా తీస్తున్నాడు విజయ్ ఆంటోని.

విజయ్ ఆంటోని స్వీయ నిర్మాణంలో నటించగా ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యత కూడా ఆయనే వహించాడు. విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 చిత్రంలో ఆరు శాఖల్లో పని చేయడం విశేషం.

- Advertisement -

తాజాగా బిచ్చగాడు 2 సినిమా అఫిషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. బిచ్చగాడు లో వెయ్యి కోట్లకి ఆస్థి పాస్తులకి వారసుడిగా కనిపించగా ఈ బిచ్చగాడు 2 లో లక్ష కోట్ల ప్రాపర్టీ ఉన్న బిజినెస్ మ్యాన్ గా ఇండియా లో 7వ రిచెస్ట్ మ్యాన్ గా కనిపి ఇస్తున్నాడు. ట్రైలర్ లో నిర్మాణ విలువలు చాలా రిచ్ గా కనిపించాయి. పేరున్న నటీనటులు ఎక్కువగా కనిపించకపోయినా ట్రైలర్ మొత్తం విజయ్ ఆంటోని తనదైన స్టైల్ లో కనిపించాడు. అయితే మొదటి భాగం తో పోలిస్తే బిచ్చగాడు 2 లో కమర్షియాలిటీ కొంచెం ఎక్కువైంది అనిపించింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థప్పర్ నటించగా యోగిబాబు, దేవ్ గిల్, జాన్ విజయ్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళం లో పిచ్చ కారన్ 2 పేరుతో రూపొందించిన ఈ సినిమా తెలుగులో బిచ్చగాడు2 పేరుతో వస్తుంది. మే 19 న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ సినిమా.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు