Boxoffice: ఏజెంట్ ఫస్ట్ డే కలెక్షన్లు. మరీ ఇంత ఊహించలేదు

అక్కినేని అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన మూవీ ఏజెంట్. అఖిల్ హీరోగా వస్తున్న ఏజెంట్ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్యపాత్రలో నటించగా ముంబై కి చెందిన బ్యూటీ సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. హిప్-హాప్ తమిజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా, ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించడం జరిగింది. తాజాగా ఏప్రిల్ 28 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది.

తాజాగా ఏజెంట్ ఫస్ట్ కలెక్షన్ల వివరాలు బయటికి వచ్చాయి. టాక్ ఎలా ఉన్న భారీ ఓపెనింగ్స్ రాబడుతుందనుకున్న ఏజెంట్ నిరాశపరిచింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

నైజాం 1.33cr, సీడెడ్ 64lakhs, ఉత్తరాంధ్ర 54lakhs, ఈస్ట్ 29lakhs, వెస్ట్ 30lakhs, గుంటూరు 52lakhs, కృష్ణ 22lakhs, నెల్లూరు 16lakhs టోటల్ గా ఏపీ తెలంగాణల్లో కలిపి 4 కోట్ల షేర్ ని, 6.60 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అది కూడా 34 లక్షల హైర్స్ ని కలుపుకొని వసూలు చేసింది.
ఇక కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి 30 లక్షలు మాత్రమే వసూలు చేయగా, ఓవర్సీస్ లో 65 లక్షల షేర్ వసూలు చేసింది. టోటల్ గా ఏజెంట్ సినిమా వరల్డ్ వైడ్ గా 4.95 కోట్ల షేర్ ని వసూలు చేయగా 8.60 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

- Advertisement -

అఖిల్ సినిమా కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబడుతుందన్న ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. 37 కోట్ల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా 4.95 కోట్లు వసూలు చేయగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 32 కోట్లు రాబట్టాలి. మరి దారుణమైన టాక్ ని మూటగట్టుకున్న ఈ సినిమా ఎంతవరకు వసూలు చేస్తుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు