Balakrishna: భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్

నట సింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి ట్రైలర్ ఇవాళ రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య లైక్ నెవర్ బిఫోర్ అనే ట్యాగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇక దసరా కానుకగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈరోజు వరంగల్ లో జరగబోతుంది. భగవంత్ కేసరి సినిమా తెలంగాణ బ్యాక్డ్రాప్ లో రాబోతున్న చిత్రం అవడంతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను వరంగల్ లో ప్లాన్ చేసారు మేకర్స్.ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం మొదలవబోతుంది. ఇక మోస్ట్ అవైటెడ్ భగవంత్ కేసరి ట్రైలర్ ను ఈరోజు రాత్రి 8 గంటల 16 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే అఫీషియల్ గా ప్రకటించారు.

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో యంగ్ యాక్ట్రెస్ శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ బాలయ్యకు జోడిగా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తుండగా అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు