కొన్ని కాంబినేషన లో సినిమాలు వస్తున్నాయి అంటే చాలు, అంచనాలు ఊహకు కూడా అందవు, అలాంటి కాంబినేషనే అల్లు అర్జున్ & సుకుమార్ ది. ఆర్య సినిమాతో మొదలైన వీళ్ళ ప్రయాణం ఇప్పటికి సజావుగానే సాగుతుంది. సుకుమార్ ఎంతమంది హీరోలతో పనిచేసిన బన్నీ అంటే మాత్రం ప్రత్యేకమైన అభిమానం. అలానే బన్నీ ఎంతమంది దర్శకులతో వర్క్ చేసిన సుకుమార్ అంటే ఎక్కువ అభిమానం. వీళ్ళ బంధానికి మధ్య అభిమానం అనే మాట కూడా చిన్నదే.
రీసెంట్ గా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, పుష్ప సినిమా డైలాగ్స్ , మ్యానరిజమ్స్ ఒక రేంజ్ లో ఫేమస్ అయ్యాయి. క్రికెటర్స్ , పొలిటీషియన్స్ అంతా బన్నీ ను ఒక రేంజ్ లో ఇమిటేట్ చేశారు.
ఏ తెలుగు సినిమా చేరుకోలేని స్థాయికి పుష్ప సినిమా చేరుకుంది అని చెప్పొచ్చు. అదే రేంజ్ లో ఇప్పుడు పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయ్.
ఎప్పుడు సుకుమార్ సినిమాలకి వచ్చినట్లే పుష్ప సినిమాకి కూడా ముందు కొంచెం నెగటివ్ టాక్ వచ్చింది. ఆ తరువాత సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి కలక్షన్స్ వర్షం కురిసింది. పుష్ప సక్సెస్ మంచి ఆనందాన్ని ఇచ్చిన, దీనికి సీక్వెల్ గా రాబోయే పుష్ప 2 మాత్రం సుకుమార్ టీం ను కొంచెం టెన్షన్ పెడుతుంది. ప్రేక్షకుల అంచనాలను ఏ విధంగా అయినా అందుకోవాలి అనే ఉద్దేశ్యంతో పుష్ప 2 పై వర్క్ చేస్తుంది మూవీ టీం.