‘ఎఫ్3’ ట్రైలర్…  మళ్ళీ అవే కుళ్ళు జోకులా..!

 

2019 లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఎఫ్ 2’ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ఆ టైంలో విడుదలైన సినిమాలు అన్నీ ప్లాపవ్వడంతో ఈ మూవీకి కలిసొచ్చింది. అలా అని ‘ఎఫ్2’ లో గొప్పగా చెప్పుకునే అంశాలు ఏమీ ఉండవు. ‘జబర్దస్త్’ కి ఎక్స్టెండెడ్ వెర్షన్ లా ఉంటుంది ఆ సినిమాలో కామెడీ. అయితే ఆ సంక్రాంతి సీజన్ కు వేరే ఆప్షన్ లేక, మల్టీ స్టారర్ అప్పీల్ ఉండడం వల్ల ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. చివర్లో ‘ఎఫ్3’ పేరుతో సీక్వెల్ కూడా ఉండబోతుంది అని క్లైమాక్స్ లో రివీల్ చేశారు.  మొత్తానికి ఆ సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది. తాజాగా ‘ఎఫ్3’ ట్రైలర్ ను విడుదల చేశారు. 

 ‘ఎఫ్2’ అనేది పెళ్ళాల చుట్టూ తిరిగే కథ. అది ఓ యూనివర్సల్ సమస్యగా చూపించాడు దర్శకుడు. ఇప్పుడు కూడా డబ్బు అనేది యూనివర్సల్ సమస్య అన్నట్టు చూపించాడు. ‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు 5.. కానీ 6వ భూతం ఒకటి ఉంది. అదే డబ్బు. అది ఉన్నోడికి ఫన్ను.. లేనోడికి ఫ్రస్ట్రేషను’..  అనే డైలాగ్ తో ట్రైలర్ ను మొదలుపెట్టాడు. ఈ మూవీలో వెంకటేష్ రే చీకటితో, వరుణ్ తేజ్ నత్తితో బాధపడే హీరోలుగా కనిపించనున్నారు. 

- Advertisement -


‘వాళ్ళది పెద్ద మాయలమరాఠీ ఫ్యామిలీ.. వాళ్ళది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ”వాళ్ళది పెద్ద దగా ఫ్యామిలీ.. వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ’ … అనే పంచ్ డైలాగులు బాగున్నాయి. 
‘ఎఫ్2’ లానే ఈ మూవీలో కూడా ‘జబర్దస్త్’ కి ఎక్స్టెండెడ్ వెర్షన్ లాంటి కామెడీ ఉంటుందని ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఆ కుళ్ళు జోకులు నచ్చే వాళ్ళకి ఫన్ను.. నచ్చని వాళ్ళకి ఫ్రస్ట్రేషను అని చెప్పాలి. సమ్మర్ హాలిడేస్ అనేవి ఈ మూవీ విడుదలకి కలిసొచ్చే ఫ్యాక్టర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు