మాజీ దంపతుల బాక్సాఫీస్ వార్..!

టాలీవుడ్ లో క్రేజీ కపుల్ గా ఉన్న సమంత-నాగ చైతన్య.. వ్యక్తిగత కారణాలతో డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత.. సమంత, నాగ చైతన్య ఎప్పుడ కూడా ఎదురెదురుగా కలుసుకోలేదు. సామ్, చైతు కలుసుకోకపోయినా.. వారి సినిమాలు మాత్రం మీట్ అవడానికి రెడీ అవుతున్నాయి.

స‌మంత‌.. విడాకుల త‌ర్వాత వ‌రుస‌గా సినిమాల‌ను లైన్ లో పెట్టేస్తుంది. త‌న బిజినెస్ మార్కెట్ ను పెంచుకోవ‌డానికి పాన్ ఇండియా సినిమాల‌ను సైతం చేసేస్తుంది. స‌మంత లేటెస్ట్ గా హరి శంకర్ – హరీష్ నారాయణ్ డైరెక్ష‌న్ లో య‌శోద సినిమాను చేస్తుంది. ఈ సినిమాను చిత్ర యూనిట్ ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

అలాగే నాగ చైతన్య కూడా ఈ మధ్య కాలంలో స్పీడ్ పెంచేశాడు. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ.. బీ టౌన్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా మూవీ చేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అగస్ట్ 11న రిలీజ్ కానుంది.

దీంతో ఈ మాజీ దంపతులు బాక్సాఫీస్ బరిలో నిలవబోతున్నారు. అయితే ఈ వార్ లో ఎవరు పై చేయి సాధిస్తారా.. అని సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే వీరి తో పాటు అక్కినేని అఖిల్ కూడా ఏజెంట్ సినిమాతో బాక్సాఫీస్ పోరులో ఉండబోతున్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 12న రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు