మరోసారి దేవుడిలా

పవన్ కళ్యాణ్, ఈ పర్సనాలిటీ వెండితెరపై కనిపిస్తే చాలు
ఆడియన్స్ బాడీ లో కరెంట్ పాస్ అవుతుంది,
థియేటర్ బ్యానర్స్ తో నిండిపోతుంది,
బొమ్మ పడితే థియేటర్ లో కాగితాల సునామి మొదలవుతుంది.
అరుపులు ఆకాశన్ని అంటుతాయి,
కలక్షన్స్ కొత్త దారులు వెతుకుతాయి.
అందరికి సాధ్యం కాదది,
ఒక సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా
వెయిట్ చేసారు అంటే అది పవన్ కళ్యాణ్ సినిమా అయ్యుండాలి.
ఒక రీమేక్ ఫిలిం తో కూడా రికార్డ్స్ కొట్టగల సామర్ధ్యం ఆయనది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్, మరో రీమేక్ ఫిలిం ను లైన్ లో పెట్టనున్నారు . తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదాయ సితం సినిమాని రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్లాన్ చేస్తోంది. స్టోరీ లైన్ కి పవన్ ఓకే చెప్పడంతో త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారట.
తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సముద్రఖనియే తెలుగులో కూడా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయ్.

గోపాల గోపాల, భీమానాయక్ మల్టీ స్టారర్ తర్వాత ఈ సినిమాలో కూడా పవన్ మరో నటుడితో చేసే అవకాశం ఉంది. పవర్ స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇందులో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయ్,
రెండు ప్రధాన పాత్రల్లో ఒకటి దేవుడి పాత్ర కావడంతో ఈ ఫాంటసీ క్యారెక్టర్ పవన్ చేయబోతున్నారని సమాచారం. గోపాల గోపాల సినిమాలో కృష్ణుడు గా కనిపించి అలరించిన పవన్ ఈసారి ఏ స్థాయిలో అలరిస్తారో..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు