సగమే పాసైన “సర్కారు వారి పాట”

సర్కారు వారి పాట ఇంకో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా పరంగా సినిమా అప్డేట్స్ పరంగా అభిమానులకి ఎటువంటి అభ్యంతరాలు, భయాలు లేవు. ఈ సినిమా పై మంచి అంచనాలతో ఉన్నారు మహేష్ అభిమానులు. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ట్రైలర్ లో మహేష్ ఎనర్జీ, డైలాగ్స్ ,పెరఫార్మన్స్ అన్ని వీపరీతంగా కనెక్ట్ అయ్యాయి అభిమానులకి. మహేష్ లోని ప్లస్ పాయింట్స్ అన్ని పట్టుకుని పర్ఫెక్ట్ కేరెక్టర్ ను డిజైన్ చేసాడు పరశురామ్. ఒక రైటర్ & డైరెక్టర్ కి ఒక స్టార్ హీరో దొరికితే ఏ స్థాయిలో చూపించొచ్చు అని చెప్పడానికి నిదర్శనమే సర్కారు వారి పాట ట్రైలర్.

ఇక్కడవరకు అంత బాగానే ఉంది, కానీ రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం అనుకున్న స్థాయిలో జరగలేదు, మహేష్ అభిమానులకి కూడా ఆ ఈవెంట్ అసంతృప్తిని మిగిల్చింది. మహేష్ బాబు ఈ విషయంలో తమ అంతర్గత సిబ్బంది పై సీరియస్ అయ్యారట.
ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తంలో మహేష్ మాట్లాడిన మాటలు మాత్రం అభిమానులకి మంచి సంతృప్తిని ఇచ్చాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు