సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇటీవల ప్రీ – రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్న ఈ మూవీ.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ తో పాటు మూడు సాంగ్స్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో.. రెండేళ్ల తర్వాత ప్రిన్స్ ను సిల్వర్ స్క్రిన్ పై చూడటానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
అయితే సర్కారు వారి పాట మూవీ రిలీజ్ కు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉన్నా.. ఇప్ఫటి వరకు బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. అలాగే ప్రీమియర్ షోల టికెట్స్ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇంకా ఎప్పుడు అంటూ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read More: SPY: పక్కా ప్లానింగ్ ఉంటే చాలు – బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదని ప్రూవ్ చేస్తున్న నిఖిల్..!
అయినా.. బుకింగ్స్ పై మాత్రం దిల్ రాజు మౌనంగానే ఉన్నాడు. అయితే టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడానికి ఇంకా టైమ్ పట్టేట్టు ఉందని తెలుస్తుంది. దీనికి కారణం.. టికెట్ల రెట్లు పెంచడం. ఏపీ గవర్నమెంట్ ఇప్పటికే టికెట్ పై రూ. 45 పెంచగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల రెట్లపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు.
దీంతో తెలంగాణ సర్కారు నుంచి టికెట్ల రెట్ల అనుమతి వచ్చిన తర్వాతే.. సర్కారు వారి పాట బుకింగ్స్ స్టార్ట్ చేయాలని నిర్మాత దిల్ రాజ్ భావిస్తున్నాడట. దీంతో కేసీఆర్ అనుమతి వచ్చేది ఎప్పుడో.. టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడో అంటూ సినీ లవర్స్ అంటున్నారు.
Read More: Raviteja: రవితేజ నుండి కామెడీ సినిమా – హిట్ దక్కేనా..?
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు...
శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో...
చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా...
టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది...