మళ్ళీ ఏడేళ్ల తరువాత

నాగ్ అశ్విన్ తీసినవి రెండే సినిమాలు అయినా,అవి అద్భుతాలు.
మహానటి సావిత్రమ్మ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి
థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడి కళ్ళలో నీళ్లు తెప్పించాడు.
నాగ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ అశ్విన్ ,
మహానటి సినిమాతో తెలుగు సినిమా స్థాయినీ శిఖరం మీద నిలబెట్టాడు.
ఎప్పుడు జరిగే దానిని అనుభవం అంటారు
ఎప్పుడో జరిగే దానిని అద్భుతం అంటారు
అలాంటి అద్భుతమే తాను తీసిన మహానటి సినిమా.
ఎన్ని సినిమాలు వచ్చిన మనసుకు హత్తుకునే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి అలాంటి తక్కువ సినిమాలలో మహానటి సినిమా ఒకటి.

అటువంటి దర్శకుడు, బాహుబలి సినిమాతో యూనివర్సల్ స్టార్ ఐన ప్రభాస్ కలయిక లో ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి,అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న “ప్రాజెక్ట్ కె” లో
బాలీవుడ్ బ్యూటీ దిశాప‌టాని ఎంట్రీ ఇవ్వనుంది.
మెగాహీరో వ‌రుణ్‌తేజ్ న‌టించిన ‘లోఫ‌ర్’ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ‘ఎమ్‌.ఎస్ ధోని’, ‘బాగీ-2’,3 వంటి సినిమాల‌తో ఈమె క్రేజ్ బాగా పెరిగింది. చేతి నిండా ప్రాజెక్ట్‌ల‌తో తీరిక లేకుండా గ‌డుపుతుంది. తాజాగా ఈమె ప్ర‌భాస్ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ప్రాజెక్ట్‌-K మేక‌ర్స్ దిశాప‌టానికి వెల్‌క‌మ్ చెప్తూ ఫ్ల‌వ‌ర్ బొకేను పంపారు. దీన్ని దిశా ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాల‌ని మూవీ టీం ప్లాన్ చేస్తుంది.లోఫర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మళ్ళీ ఏడేళ్ల తరువాత తెలుగులో సినిమాని చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు