హిస్టరీ రీపీట్ అవుద్దా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ రోజు సాయంత్రం యూసఫ్ గూడ పోలీస్ స్టేషన్ లో ప్రీ – రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు. అయితే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఓ లేఖ రాశాడు. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించాలని కోరాడు. అలాగే మహేష్-త్రివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28 మూవీ షూటింగ్ జూన్ లోనే స్టార్ట్ అవుతుందని ప్రకటించాడు. హారికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు నిర్మిస్తున్నట్టు తెలిపాడు.

అప్పట్లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా అప్పుడు కూడా మహేష్ ఇలానే తన అభిమానులను ఉద్దేశిస్తూ ఒక లేఖను రాసారు, అప్పటిలో గుణశేఖర్ దర్శకత్వంలో సైనికుడు షూటింగ్ జరుగుతుంది అని ఆ లేఖలో పేర్కొన్నాడు మహేష్.
జరుగుతున్న పరిణామాలు , మహేష్ ఇచ్చిన స్టేట్మెంట్స్ , సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ , అప్డేట్స్ ను బట్టి చూస్తుంటే పోకిరి రేంజ్ హిట్ అయి, హిస్టరీ రిపీట్ అవుతుంది అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు