ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మిగతా సినీ పరిశ్రమలకు చిన్న చూపు.
కానీ బాహుబలి సినిమా రిలీజ్ అయిన తరువాత తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిపోయింది. తెలుగు సినిమాలకోసం మిగతా ఇండస్ట్రీలు వెయిట్ చేసే పరిస్థితి. ప్రస్తుతం తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తోంది.
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “తగ్గేదే లే” అంటూ అల్లు అర్జున్ చేసిన మ్యానరిజం ఎంతోమందిని ప్రభావం చేసింది, క్రికెటర్స్ ఎంతోమంది రాజకీయనాయకులు ఈ డైలాగ్ ఒక రేంజ్ లో వాడుకున్నారు. తెలుగులోనే కాకుండా ఈ సినిమా బాలీవుడ్ ఆడియెన్స్‌ను ఈ మూవీ బాగా ఆకట్టుకుంది.
పుష్ప మూవీ బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో సక్సెస్ కావడంతో.. పుష్ప 2 సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
బన్నీ తో మూడు సినిమాలను చేసిన సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలుకానుంది.
2023 లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.